బిగ్ బాస్ 4: ఈసారి సెలబ్రిటీల సపోర్ట్ ఎక్కువ అతనికే..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది బిగ్ బాస్. మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్లు ఉండటంతో పెద్దగా బిగ్ బాస్ నీ జనాలు ఆదరించలేదు. వీకెండ్ ఎపిసోడ్ లు మినహా… నార్మల్ డేస్ లో టిఆర్పి రేటింగులు పడిపోయాయి. ముఖ్యంగా టాస్క్ లు గత సీజన్లలో ఉన్నవే కావటంతో, కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ సోషల్ మీడియాలో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Bigg Boss after Avinash for TRP's |పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకోవడంతో ఇంటిలో ఉన్న సభ్యులకు బయట ఉన్న చాలా మంది ప్రముఖులు సపోర్ట్ చేస్తూ ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా గత సీజన్ లో చాలామంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ శ్రీముఖి ని సపోర్ట్ చేయగా, తాజా సీజన్ లో చాలామంది సెలబ్రిటీలు జబర్దస్త్ అవినాష్ నీ గెలిపించాలని సపోర్ట్ చేయాలని వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో క్యాంపన్ చేస్తున్నారు.

ఇప్పటికే శ్రీముఖి అదేవిధంగా మెగా బ్రదర్ నాగబాబు ఇంకా చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అదే రీతిలో జబర్దస్త్ టీం సభ్యులు సోషల్ మీడియాలో అవినాష్ కి సపోర్ట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీజన్ లో చాలావరకు బిగ్ బాస్ షోలో సెలబ్రిటీ ఎలా సపోర్ట్ దక్కించుకుంది మాత్రం ముక్కు అవినాష్ అని చెప్పవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఇంటిలో చాలావరకు ఎంటర్టైన్ చేయడంలో అవినాష్ సక్సెస్ అవ్వటం తో అతనికి నార్మల్ నెటిజన్లు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న ఊపు చూస్తే కచ్చితంగా అవినాష్ టాప్ ఫైవ్ లో కి వెళ్ళటం గ్యారెంటీ అని జనాలు డిస్కషన్లు చేసుకుంటున్నారు.