బిగ్ బాస్ 4 : షో నిర్వాహకులను టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు కంటెస్టెంట్ లు..!!

బిగ్ బాస్ సీజన్ 4 అంతా బాగానే ఉన్నా కానీ ఎలిమినేషన్ విషయంలో విమర్శలు బయట నుండి భారీ స్థాయిలో వస్తున్నాయి. ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా షో నిర్వాహకులు తమ సొంతంగా స్క్రిప్ట్ పరంగా.. ఇంటిలో ఉన్న సభ్యులను బయటకు పంపుతునట్లు బయట తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. కావాలని టిఆర్పి రేటింగులు తగ్గిపోకుండా హౌస్ లో వీక్ కంటెస్టెంట్ లను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు షో నిర్వాహకులు పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మోనాల్ విషయములో. ఆమెని అడ్డంపెట్టుకుని ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాదిరిగా అభిజిత్, అఖిల్ వ్యవహారాన్ని బయటకు ప్రొజెక్ట్ చేస్తున్నారని బయట జనాలు తెగ తిట్టుకుంటున్నారు.

Bigg boss: 'Possessive' Akhil and 'Weeping' Monal's romantic thread  irritates audienceగత వారం ఎలిమినేషన్ లో ఓట్ల పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా కుమార్ సాయి కి బదులు మోనాల్ ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండీట్ అని కావాలని, కానీ షో నిర్వాహకులు… ఆమెను కాపాడుతున్నారని అంటున్నారు. అదేవిధంగా అఖిల్ ని కూడా అదే రీతిలో సేవ్ చేస్తున్నారని బయట జనాలు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

 

దీంతో విమర్శలు భారీస్థాయిలో వస్తున్న నేపథ్యంలో… ముందుగా మొనల్ నీ  ఆ తర్వాత అఖిల్ నీ కూడా పంపించే యోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈవారం ఎలిమినేషన్ లో అభిజిత్, అవినాష్, అరియనా, దివి, అదేవిధంగా మోనాల్ ఉండటంతో ఆమె ఈసారి ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి అవకాశాలు మెండుగా ఉన్నాయని బయట టాక్. గేమ్ పరంగా చూసినా ఈ ఆరుగురిలో వీక్ కంటెస్టెంట్ కూడా మోనాల్ అని అందరూ డిసైడ్ అయిపోయారు.