తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు సీజన్స్ తో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో స్టార్ మా నిర్వాహకులు నాలుగో సీజన్ ని భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సారి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందటంటో సీజన్ 4 ఉంటుందా.. ఉండదా అన్న సందేహాలు అందరిలోను కలిగాయి.
కాని అనూహ్యంగా బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేసి స్టార్ మా సీజన్ 4 ఉందని కన్ఫర్మ్ చేశారు స్టార్ మా. దాంతో హోస్ట్ గా ఈ సీజన్ కి ఎవరు వ్యవహరించబోతున్నారన్న టాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎక్కువగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు వినిపించింది. అలాగే ఎన్.టి.ఆర్.. నాని.. పేర్లు ప్రచారంలో నిలిచాయి. కాని ఎట్టకేలకి నాలుగో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ అని వెల్లడించారు.
మనం సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాగార్జున మూడు రకాల గెటప్స్ తో రిలీజైన ప్రోమో ప్రేక్షకుల్లో టన్నులకొద్దీ ఎనర్జీని తీసుకు వచ్చింది. కాని సీజన్ 4 మొదలై పార్టిసిపెంట్స్ విషయంలో మొదటి ఎపిసోడ్ తోనే ప్రేక్షకులను డిసప్పాయింట్ అయ్యారన్న టాక్ వచ్చింది.
కాని సీజన్ 4 కి బాగా ప్లస్ అయింది మాత్రం కింగ్ నాగార్జున డ్యూయల్ రోల్. ఈ సీజన్ 4 మొత్తాన్ని ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మిగతా విషయాలలో బిగ్ బాస్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరచిందంటున్నారు. ఇప్పటి వరకు గడిచిన మూడు సీజన్లకు మంచి హైప్ అండ్ రేటింగ్ లు వచ్చాయి. కానీ ఈ నాలుగో సీజన్ కు మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచే పాపులర్ కంటెస్టెంట్స్ లేక షో తేలిపోయిందని చెప్పుకుంటున్నారు.
ఈ ఫీడ్ బ్యాక్ ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎపిసోడ్స్ కి రేటింగ్ దారుణంగా పడిపోయే అవకాశం ఉందని భావించిన షో నిర్వాహకులు ముందుగానే కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎపిసోడ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ 4 ఏదో జరుగుతుందనుకుంటే ఏదో అయిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.