బిగ్ బాస్ 4: ఈవారం డేంజర్ ఎలిమినేషన్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్..??

Share

బిగ్ బాస్ అన్ని సీజన్లకు మించి నాలుగో సీజన్ ఎలిమినేషన్ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ లని కావాలనే బిగ్ బాస్ ఇంటి నుండి సాగనంపుతూ ఉన్నారని, ప్రేక్షకులు ఓటింగ్ పరంగా కాకుండా స్క్రిప్టు పరంగా ఎలిమినేషన్ జరుగుతోందని అనేక విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 11 వ వారం లో ఇంటిలో వాతావరణం హాట్ హాట్ గా ఉంది.

Bigg Boss Telugu: Lasya as Captain and No Kattappa in the houseఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వటంతో ఇంటి సభ్యులు మొన్నటివరకూ నువ్వా నేనా అన్నట్టు ఉండగా తాజాగా కలిసిపోయి చూస్తున్న ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వారం ఆరుగురు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు చూసుకుంటే అభిజిత్, ఆరియానా. సోహెల్, హారిక, మోనాల్, లాస్య. కాగా వీరిలో అభిజిత్, ఆరియానా. సోహెల్, హారిక చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.

మొదటి నుండి ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరియు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇంటి నుండి మోనాల్ లేదా లాస్య వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు డిస్కషన్లు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం మోనాల్ ఇంటిలో ఉండే అవకాశం ఉందని, ఆమె ఉండటంవల్ల అఖిల్ మరియు అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఓటింగ్ పరంగా చూసుకుంటే లాస్య కంటే మోనాల్ ముందంజలో ఉందని బయట టాక్. లాస్య చాలావరకు సేఫ్ గేమ్ ఆడుతూ ఎక్కడా కూడా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన సందర్భాలు లేకపోవడంతో పాటు స్క్రీన్ షేరింగ్ లో కూడా ఆమె వాటా తగ్గిపోవటంతో, ఈవారం ఖచ్చితంగా లాస్య ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని బయట జనాల టాక్.


Share

Related posts

AP Cabinet Meeting: బ్రేకింగ్ న్యూస్ – ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు..!

Srinivas Manem

Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురూష్ సెట్ లో అగ్ని ప్రమాదం ? ముంబై లో కలకలం

arun kanna

Big Breaking : చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు..! అయిదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి..!!

somaraju sharma