Bigg Boss 5 Telugu: జెస్సీ బాధపడుతున్న “వేర్టిగో” వ్యాధి లక్షణాలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వారం వారం చాలా షైన్ అయి.. టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ జెస్సీ. ప్రారంభంలో హౌస్ లో అడుగుపెట్టిన సమయంలో.. ఆటలో అరటిపండు మాదిరిగా మనోడు గేమ్ ఉండేది. ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ లో.. ఇంటిలో చాలా మంది సభ్యులు… జెస్సీ ని టార్గెట్ చేసి.. మరి నామినేషన్ ప్రక్రియ లో నించో పెట్టేవాళ్ళు. మోడలింగ్ రంగంలో ఎంతో పేరు సంపాదించిన..జెస్సీ.. 36 గంటల పాటు ర్యాంప్ వాక్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది. పలు యాడ్స్ లో నటించిన జెస్సీ… బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి ప్రస్తుతం కీలకంగా రాణిస్తున్నాడు. జెసి ఆటతీరు గమనిస్తే.. స్టార్టింగ్ లో ఎవరితో పెద్దగా కనెక్ట్ కాలేకపోయినా మూడవ వారం నుండి… షణ్ముఖ్ జస్వంత్ అదే రీతిలో సిరి తో కలిసి గ్రూపుగా క్రియేట్ అయ్యి.. కీలకంగా రాణించాడు.

సిరి లేదా షణ్ముక్ కి ఏదైనా జరిగితే వెంటనే హౌస్ లో మిగతా వారి పని పట్టేవారు. వీరి ముగ్గురి బాండింగ్ కి బిగ్ బాస్ హౌస్ లో మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. కాగా ఫిజికల్ టెస్ట్కు పరంగా.. మంచి పోటీ ఇస్తూ ఆడుతున్న జెసి ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యి… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. చాలా ఫిజికల్ టాస్క్ లకి దూరంగా ఉంటూ ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా … ఇబ్బంది పడకుండా ఆడుతూ ఉన్నాడు. ఒకపక్క డాక్టర్స్ తో చెక్ అప్ చేయించుకుని మెడిసిన్ తీసుకుని హౌస్ లో రాణిస్తున్నాడు. “వేర్టిగో” అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు.. తనకి రెస్ట్ కావాలని.. చాలా సందర్భాలలో హౌస్లో జెస్సి కెమెరాల ముందు తెలియజేయడం జరిగింది. కాగా జెస్సీ బాధపడుతున్న వ్యాధి “వేర్టిగో” లక్షణాలు గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి బారిన పడే వారికి కళ్ళు తిరగడం, తల తిరగడం అంటూ ఉంటాం. వినికిడి శక్తి మందగించడం, వాంతి వస్తుందనే ఫీలింగ్ తో పాటు వికారంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. తలను కదిలించినపుడు ఇలాంటి లక్షణాలు ఆ వ్యక్తికి కనిపిస్తాయి.

సీక్రెట్ రూమ్ .. హౌస్ లో

వేర్టిగో రెండు రకాలు ఒకటి సెంట్రల్‌ వేర్టిగో, రెండు పెరిఫరల్‌ వేర్టిగో. 30-40% మందికి వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఇలా కళ్ళు తిరగడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధి అన్ని రకాల వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది లెక్కల ప్రకారం 15% జనాభా కళ్ళు తిరగడం, 5% జనాభా వేర్టిగో అని భావిస్తారు. వెర్టిగో అనే పదం లాటిన్ భాష వెర్తో నుండి రావడం జరిగింది. ఒకచోట కూర్చున్న గాని కళ్లు తిరుగుతున్నట్లు తూలుతున్నట్లు అనిపిస్తూ భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా అనే భ్రమ లో ఉన్నట్టు.. వాంతులు వినికిడి శక్తి వచ్చే ఫీలింగ్.. ఈ వ్యాధి బారిన పడే వారికి బాగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో ఈ వ్యాధితో బాధపడుతున్న జేసీ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకునే సీక్రెట్ రూమ్ లో.. హౌస్ లో జరిగే సన్నివేశాలు గమనిస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుసుకుంటూ… మూడో కన్ను బిగ్ బాస్ తో పాటు వేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇంటి సభ్యుల ఆలోచన పరంగా చూసుకుంటే జెసి ఇంటికి వెళ్లిపోయినట్లు భావిస్తూ ఉండగా మనోడు సీక్రెట్ రూమ్ లో.. ఇంటి సభ్యుల భాగోతాలు మొత్తం కనిపెడుతూ ఉన్నాడు.


Share

Related posts

అందుకే నన్ను అదిరింది షో నుంచి తీసేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ సమీర?

Varun G

Rajamouli: పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్ చేసిన రాజమౌళి తండ్రి..!!

sekhar

Maha Samudram: “మహాసముద్రం” లో గరుడ స్టన్నింగ్ లుక్ రివిల్..!!

bharani jella