Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియ ఆంటీ ఫేవరెట్ హీరో అతనే నట..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ప్రియ ఆంటీ ఉన్నంతకాలం రచ్చరచ్చగా సాగింది. వారంలో ఎవరితో ఒకరితో… గొడవ పెట్టుకునే ప్రియ ఆంటీ(Priya Aunty).. ఆ వారం మొత్తానికి బిగ్బాస్బిగ్ బాస్(Bigg Boss) ఆడియన్స్ కి గుర్తుండిపోయే రీతిలో… రచ్చ రచ్చ చేసేది. సీజన్ ఫైవ్ మొత్తానికి హైలెట్ గొడవ.. రవి(Ravi) లహరి(Lahari)కి హగ్ ఇవ్వటం.. ఆరిజన్ చెప్పి మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో.. లహరి ని నామినేట్ చేయడం ఆ సమయంలో రవి తో పాటు ఇంటిలో ఉన్న మగవారిపై ప్రియ ఆంటీ చేసిన వైరల్ డైలాగులు రచ్చరచ్చగా మారింది. లహరి హౌస్ లో ఆడవాళ్ళ తో తప్ప మిగతా మగ వారందరితో.. చాలా క్లోజ్ గా ఉంటుందని.. ముఖ్యంగా రవితో దగ్గరగా ఉంటుందని ప్రియ ఆంటీ వైరల్ కామెంట్లు చేసింది.

Bigg Boss 5 Telugu: Priya To File A Complaint Against The Makers? Here's  The Truth - Filmibeat

అయితే ప్రియ ఆంటీ(Priya Aunty) కామెంట్లు అలా చేయటం వెనుక రవి ప్రోద్బలం ఉందని వీడియో బయటపడటం.. తో.. ఆ గొడవ మొత్తానికి రవికి ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత హౌస్ లో సన్నీ ని టార్గెట్ చేసి ప్రియ ఆంటీ.. ప్రతి నామినేషన్లో.. సన్నీ(Sunny)ని నామినేట్ చేయడం జరిగింది. వెళ్ళిపోయే ముందు వారం ఏడో వారం లో హౌస్ లో సన్నీ ని టార్గెట్ చేసి ప్రియా ఆంటి ఆడిన ఆట తీరు శేషం మొత్తానికి హైలెట్. కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడుతున్న సమయంలో సన్నీ ని టార్గెట్ చేసుకుని వాడు వీడు అని డైలాగులు వేయడంతోపాటు చంప పగిలిద్ది.. అని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత వారం ప్రియా అంటే ఇంటి నుండి ఎలిమినేట్ కావడం అంత తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ అనుభవాల గురించి బయట పలు ప్రముఖ టీవీ చానల్స్ కి ప్రియ ఆంటీ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. బుల్లితెరపై తనకంటూ సపరేట్ క్రేజీ దక్కించుకున్న ప్రియ ఆంటీ బిగ్ బాస్ హౌస్ లో… ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని.. మర్చిపోలేని రీతిలో ప్రయాణం సాగిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

5 Movies Of Nani That Escalated Him From An Actor To A Natural Star! -  Filmibeat

సన్నీ గేమ్ చాలా బాగుందని మంచివాడు అని…

ఇదిలా ఉంటే చాలా సినిమాలలో నటించిన ప్రియ ఆంటీ కి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇప్పటి వరకు నాని తో నటించే అవకాశం దక్కలేదని ఎదురుచూస్తున్నట్లు.. ప్రియ ఆంటీ స్పష్టంచేసింది. పలు సీరియల్స్ లో నటిస్తున్న ప్రియ ఆంటీ సినిమా రంగంలో కూడా పలు అవకాశాలు ఇటీవల దక్కించుకున్నట్లు టాక్. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్నంతకాలం సన్నీ తో గొడవ పడిన ప్రియ ఆంటీ.. బయటకు వచ్చాక సన్నీ గేమ్ చాలా బాగుందని మంచివాడు అని పొగడ్తల వర్షం కురిపిస్తోంది. కేవలం గేమ్ పరంగా మాత్రమే తాను ఏడో వారం లో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని.. తర్వాత ఇద్దరం కూడా సారీ చెప్పటం జరిగిందని ప్రియ ఆంటీ బయటికొచ్చాక పేర్కొంది. కచ్చితంగా సన్నీ బయటకు వచ్చాక అతని కలుస్తాను.. అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక హౌస్ లో ఫ్రెండ్షిప్ పరంగా చూసుకుంటే.. సిరి, షణ్ముక్, జెస్సి.. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్ షిప్ చాలా బాగుంటుందని .. సిరి గేమ్ పరంగా చాలా యాక్టివ్ గా ఆడుతోంది షణ్ముఖ చాలా తెలివిగా గేమ్ ఆడతాడు అన్న తరహాలో ప్రియా వంటి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తోంది. ఇక తన పరంగా పింకీ అంటే చాలా ఇష్టం అని హౌస్లో అందరితో కంటే ఎక్కువగా.. పింకీ తో నే ఉండటం జరిగిందని.. ఆమె గెలవాలని కోరుకుంటున్నట్లు ప్రియ ఆంటీ స్పష్టం చేయడం జరిగింది.


Share

Related posts

అమెరికా ఎన్నికల ద్వారా.. సభ్య సమాజానికి ఏం సందేసమిద్దామని..!?

Vissu

Bigg Boss 5 Telugu: అమాంతం పెరిగిపోయిన సన్నీ గ్రాఫ్ కారణాలు ఇవే అంటున్న జనాలు..!!

sekhar

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి బిగ్ స్ట్రాటజీ..??

sekhar