Bigg Boss 5 Telugu: హౌస్ లో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండ్ గా రవికి బుక్కయిన కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 5 Telugu: కుస్తీ పోటీల లో రవి టీం గెలవడంతో బిగ్బాస్ అదనంగా 150 నాణాలు పంపించడం జరిగింది. ఈ తరుణంలో ఖజానా పెట్టి నుండి దొంగతనం చేసిన వారిపై విశ్వ దారుణంగా విమర్శలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో మానస్… విశ్వ మధ్య మాటా మాటా పెరిగింది. ఆ తర్వాత అది పెద్ద గొడవ కి దారి తీసింది. ఈ రీతిగా రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో హౌస్ లో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. ఏకంగా ఒకరిపై మరొకరు గొడవకు దిగుతూ కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎపిసోడ్ లో మానస్, జెస్సీ వీరలెవల్లో గేమ్ ఆడారు.

రవి టీం సభ్యులకు.. చుక్కలు చూపించారు. మొత్తంమీద చూసుకుంటే కుస్తీ పోటీలో సన్నీ టీం ఓటమిపాలైన గాని రవి టీం సభ్యులను మిగతా టాస్క్ లలో… బాగా ఓడించారు. బోర్డుకి ఫోటోలు పెట్టే గేమ్ లో.. అయితే.. శ్రీరామ్ నీ.. విశ్వ నీ చెడుగుడు ఆడుకున్నారు.. సన్నీ టీమ్ సభ్యులు. హౌస్ లో బాడీ బిల్డర్ అయినా విశ్వ నీ.. మానస్ బాగా డిఫెండ్ చేశాడు. ఇక ఇదే తరుణంలో రవి టీం కెప్టెన్ శ్రీరామ్..నీ జెస్సి బీభత్సంగా.. ఓ ఆట ఆడుకున్నాడు.

Bigg Boss 5 Telugu: RJ Kajal fires on anchor Ravi

మెప్పించడానికి బదులు ఎక్కువగానే దోచుకున్నారు…

ఇద్దరు కొట్టుకునే దాకా పరిస్థితి వచ్చినా గానీ జెస్సి ఏ మాత్రం పట్టు విడవకుండా… శ్రీరామ్ నీ.. నేలకేసి అధిమేశాడు. మొత్తం మీద బుధవారం జరిగిన ఎపిసోడ్ లో… రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో… సన్నీ టీం సభ్యులు ఐక్యమత్యంతో ఆడి.. జట్టు ని గెలిపించుకోవడం జరిగింది. తాడుతో రెండు టీంలు ఆడిన ఆటలో కూడా.. ఇద్దరు రాజులు పాల్గొనగా సన్నీ టీం గెలవడం విశేషం. సన్నీ రాజుగా తన ఇంటి సభ్యులను బాగా ప్రోత్సహించి.. ముందుండి రాణించాడు. ఇలా ఒక పక్క టాస్క్ లు.. జరుగుతూ ఉండగా మరో పక్క కంటెస్టెంట్ లు ఎవరికివారు నిధి లో ఉండే నాణాలు సంపాదించుకునే పనిలో భారీగా దొంగతనాలకు పాల్పడ్డారు. రాజులను మెప్పించడానికి బదులు ఎక్కువగానే దోచుకోవడానికి.. ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో రాజు రవికి.. అతని సామ్రాజ్యంలోనే ఉన్న కాజల్.. అతని ఖజానా పెట్టి లో నుండి నాణాలు దోచుకుంటూ ఉంటుండగా రాజు రవి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.

Bigg Boss 5: Kajal vs Anchor Ravi బిగ్ బాస్ 5: కాజల్ vs యాంకర్ రవి

ఖజానాలో నుండి కాజల్ దొంగతనం చేస్తూ….

ఈ క్రమంలో రవి ఆమెను ప్రశ్నించగా.. మరో మాట చెప్పకుండా మాటలు బుకాయిస్తూ కాజల్ తప్పించుకుంది. ఇదే తరుణంలో రవి కూడా పెద్దగా గొడవ చెయ్యకుండా.. ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. అంతకుముందే కాజల్.. రవి, లోబో పై సెటైర్లు వేయటంతో.. అది చాలా పెద్ద గొడవ గా మారింది. అయినా కానీ.. ఆ గొడవ జరిగిన తరువాత తన ఖజానాలో నుండి కాజల్ దొంగతనం చేస్తూ పట్టుబడిన గాని.. రవి పెద్దగా స్పందించకపోవడం.. తేలిగ్గా తీసుకోవడం జరిగింది. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో “రాజ్యానికి ఒక్కడే రాజు” టాస్క్ లో… బాగా గొడవలు జరగటం తో.. ఐదో వారం బిగ్ బాస్ షో.. చాలా రసవత్తరంగా సాగింది. ఎవరికి వారు ఇంటికి కెప్టెన్ అవ్వడం కోసం.. భారీగా గేమ్ ఆడటం జరిగింది. రాజులను పెద్దగా పట్టించుకోకుండా నాణాలు దోచుకోవడానికే ఎక్కువ శ్రద్ధ చూపించారు. కొంతమంది టీమ్ గేమ్ ప్రదర్శించగా మరికొంతమంది సెల్ఫ్ గేమ్ ఆడుతూ.. రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ లో.. కీలకంగా రాణించారు. 


Share

Related posts

మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన వైయస్ జగన్ సర్కార్..!!

sekhar

కొద్ది రోజుల్లో టాటా కొత్త కారు వచ్చేస్తుందోచ్.. ఫీచర్.. ధర వివరాలు ఇవే

bharani jella

హాస్పిటల్ నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన కరోనా వైరస్ సోకిన వ్యక్తి

Siva Prasad