Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఏడవ వారం రచ్చ మామూలుగా లేదు. నామినేషన్ ప్రక్రియ అయిన లేదా కెప్టెన్సీ టాస్క్ అయినా భారీగా గొడవలు చోటు చేసుకున్నాయి. గ్రూపులుగా ఉన్నా చాలామంది విడిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఎక్కువగా మాత్రం ఏడో వారం లో నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితులు కంటెస్టెంట్స్ సన్ని(Sunny) ప్రియ ఆంటీ (Priya Aunty)ల మధ్య.. అనేక పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి.. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా గొడవలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ సమయంలో స్ట్రాంగ్ రీజన్ తో… కంటెస్టెంట్ ని నామినేట్ చేయాలి.
కానీ కావాలని ప్రియ ఆంటీ రవిని సిల్లీ రీజన్ తో… నామినేట్ చేసిన తరుణంలో సన్నీ.. ఇద్దరూ తనతో గేమ్ ఆడుతున్నారని రవి(Ravi) ని నామినేట్ చేయడం తెలిసిందే. మరోపక్క ఇదే తరుణంలో బంగారు కోడిపెట్ట టాస్క్ ఆడుతున్న సమయంలో సన్నీని వాడు వీడు అని పెట్టడంతోపాటు చెంప పగులుతుంది.. అంటూ భారీ డైలాగులు వేస్తూ రెచ్చగొట్టే రీతిలో ఆడటం మాత్రమేకాక సన్నీ గేమ్ ఆడుతూ.. దాచుకున్న గుడ్లను దోచేస్తూ.. ప్రియ ఆంటీ.. తెగ రెచ్చిపోయింది.
నాగార్జున(Nagarjuna) పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు
ఈ వారం మాత్రమే కాదు అంతకు ముందు కూడా చాలా మందితో ఈ విధంగానే వ్యవహరించింది. ఇటువంటి తరుణంలో వీకెండ్ ఎపిసోడ్ లో… ఇప్పటివరకు ప్రియా ఆంటి(Priya Aunty) వ్యవహరించిన తీరు పట్ల నాగార్జున(Nagarjuna) పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. కానీ ఏడవ వారం లో… ప్రియ ఆంటీ వ్యవహరించిన తీరుకు నాగార్జున..(Nagarjuna) రియాక్ట్ కాకుండా మామూలుగా గతంలో మాదిరిగా వ్యవహరిస్తే మాత్రం ఆయన ఇక హోస్ట్ గా వేస్ట్ అని… బయట జనాలు అంటున్నారు. రేపే వీకెండ్ ఎపిసోడ్ కావటంతో ఈ విషయంపై బిగ్ బాస్(Bigg Boss) ఆడియాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.