ట్రెండింగ్ న్యూస్

Bigg boss Abijeet : పులి కోసం బిగ్ బాస్ అభిజీత్ వేట.. అడ్వెంచర్ అంటే ఇదీ బాస్?

Bigg boss Abijeet పులి కోసం బిగ్ బాస్ అభిజీత్ వేట అడ్వెంచర్ అంటే ఇదీ బాస్
Share

Bigg boss Abijeet : బిగ్ బాస్ అభిజీత్ Bigg boss Abijeet గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ 4 తెలుగు విజేతగా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు అభిజీత్. ప్రస్తుతం అభిజీత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయినా కూడా తనకు స్క్రిప్ట్ నచ్చితేనే అభిజీత్ ఓకే చెబుతున్నాడు. నిజానికి అభిజీత్ రూటే సపరేట్. చాలా రిజర్వ్ డ్ గా ఉంటాడు. ఎక్కువ మాట్లాడడు. కానీ.. తెలివితో మాట్లాడుతాడు. ఏది మాట్లాడినా దాంట్లో పాయింట్ ఉంటుంది. ఏమాత్రం అటూ ఇటూ మాట్లాడడు. అందుకే.. అభిజీత్ ను చాలామంది లైక్ చేస్తారు. ముఖ్యంగా అభిజీత్ కు యువతులైతే ఫిదా అయిపోతారు. అభిజీత్.. అభిజీత్ అంటూ యువతులు చీర్స్ కొడుతుంటారు. మొత్తం మీద బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక అభిజీత్ లైఫ్ స్టయిలే మారిపోయింది.

Bigg boss Abijeet adventure in Tipeshwar maharashtra
Bigg boss Abijeet adventure in Tipeshwar maharashtra

నిజానికి అభిజీత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అడ్వెంచర్స్ అన్నా చాలా ఇష్టం. ఇప్పటికే అభిజీత్ దేశం మొత్తం తిరిగాడు. అడవుల్లోకి కూడా వెళ్లి ప్రకృతిని ఆస్వాదించాడు.

అయితే.. తాజాగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవికి వెళ్లాడు అభిజీత్. కేవలం పులిని దగ్గరి నుంచి లైవ్ లో చూడటం కోసం ఈ సాహసం చేశాడు అభిజీత్.

Bigg boss Abijeet : తిప్పేశ్వర్ అడవుల్లో పులి కోసం జల్లెడ పట్టిన అభిజీత్

అయితే.. తిప్పేశ్వర్ అడవులకు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన అభిజీత్.. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. కానీ.. పులి మాత్రం కనిపించలేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పులి కోసం వెతకని చోటు లేదు. కానీ.. చివరకు ఇక వెళ్లిపోదామని అనుకున్న సమయంలో రెండు పులులు వీళ్ల కంట పడ్డాయి. వెంటనే పులులను చూసి అభిజీత్ ఫుల్ టు ఎంజాయ్ చేశాడు. వాటి ఫోటోలు, వీడియోలు తీశాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు.

మీరు కూడా అభిజీత్ అడ్వెంచర్ ను చూసి ఎంజాయ్ చేయండి.

 


Share

Related posts

Telangana Intermediate: ఫెయిల్ అయిన వారిని పాస్ చేయండి!

Ram

Allu arjun : అల్లు అర్జున్ సినిమా చేయనున్న ధనుష్ నిర్మాతలు

GRK

Sarkaru Vaari Paata: మహేష్ బాబు అభిమానులకు గూస్ బంప్స్.. సర్కారు వారి పాట కిరాక్ అప్డేట్..!!

bharani jella