Bigg boss Ariyana : బిగ్ బాస్ 4 ఎందరికో లైఫ్ ను ఇచ్చింది. అసలు.. బిగ్ బాస్ 4 కంటే ముందు.. బిగ్ బాస్అరియానా Bigg boss Ariyana అంటే ఎవరో తెలియదు. సోహెల్ తెలియదు. మెహబూబ్ తెలియదు. కొందరు కంటెస్టెంట్ల గురించి అంతో ఇంతో తెలిసినా.. ఎక్కువగా వీళ్ల గురించైతే చాలామందికి తెలియదు. కానీ.. కేవలం మూడు అంటే మూడే నెలల్లో వీళ్లంతా పెద్ద సెలబ్రిటీలు అయిపోయారు.
బిగ్ బాస్ అంటేనే అలాగే ఉంటది. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి వెళ్తే చాలు. బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ అయే బయటికి వస్తారు. అందుకే.. బిగ్ బాస్ షోకు అంత క్రేజ్. నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండే అదృష్టం దక్కినందుకు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ కు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
Bigg boss Ariyana పుట్టిన రోజు వేడుకలకు మళ్లీ కలిసిన కంటెస్టెంట్లు
తాజాగా బిగ్ బాస్ అరియానా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అరియానా కూడా చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి. బిగ్ బాస్ ముందు తన గురించి ఎవ్వరికీ తెలియకున్నా.. బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకొని.. టాప్ 5లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా.. తన బర్త్ డే వేడుకల్లో సోహెల్, మెహబూబ్, కుమార్ సాయి, లాస్య, మోనల్ గజ్జర్ మెరిశారు. వీళ్లంతా కలిసి తన బర్త్ డే వేడుకల్లో హంగామా చేశారు.
దానికి సంబంధించిన వీడియోను అరియానా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి ఆ వీడియోపై.