ట్రెండింగ్ న్యూస్

Bigg boss Ariyana : హిమాలయాల్లో ట్రెక్కింగ్… అరియానా లైఫే మారిపోయిందిగా?

bigg boss ariyana trekking in himalayas
Share

Bigg boss Ariyana : బిగ్ బాస్ అరియానా తెలుసు కదా.. బిగ్ బాస్ కంటే ముందు తన గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ… ఎప్పుడైతే తనకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందో అప్పటి నుంచి తన లైఫ్ మారిపోయింది. ఒక యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అరియానా… ప్రస్తుతం ఒక సెలబ్రిటీ హోదాను అరియానా అనుభవిస్తోంది. తన చేతుల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. తనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. పలు ఈవెంట్లలో, ప్రోగ్రామ్స్ లో, టీవీ షోలలో తనకు ఆఫర్స్ వస్తున్నాయి.

bigg boss ariyana trekking in himalayas
bigg boss ariyana trekking in himalayas

అయినప్పటికీ… తను ఆఫర్స్ ను ఆచీతూచీ ఎంచుకుంటోంది. ఇప్పటికే పలు టీవీ షోలలో తను మెరిసినా అవన్నీ ఏదో టైమ్ పాస్ కు చేసినవే. తన లక్ష్యాలు వేరు… తన జీవితం వేరు. తనకు ఎక్కువగా ట్రావెలింగ్ అంటే ఇష్టం. కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం ఇష్టం.

Bigg boss Ariyana : ట్రెక్కింగ్ లో అష్టకష్టాలు పడ్డ అరియానా

వెళ్లనయితే అరియానా వెళ్లింది కానీ… హిమాలయాల్లో ఉండే చలిని మాత్రం తట్టుకోలేకపోయింది. ట్రెక్కింగ్ విషయంలోనూ కాస్త అడుగు తడబడినా… తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. ఎట్టకేలకు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసి సూపర్ డూపర్ ఎంజాయ్ చేసింది అరియానా.

తనకు సొంత యూట్యూబ్ చానెల్ ఉన్న విషయం తెలుసు కదా. తన యూట్యూబ్ చానెల్ లో హిమాలయాల్లో ట్రెక్కింగ్ వీడియోను పోస్ట్ చేసింది అరియానా. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా హిమాలయాల్లో అరియానా చేసిన ట్రెక్కింగ్ వీడియోను చూసేయండి.


Share

Related posts

అనవసరంగా చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చి.. వైకాపాలోకి వచ్చా అనుకుంటున్న వల్లభనేని వంశీ?

CMR

కారు అదిరే తీరు..! టాటా నుండి కొత్త మోడల్ కారు, వివరాలివే..!

bharani jella

బాబుగారికి తెలీకుండా ఆయన వెనకే ఆయనమీదే కొంపమునిగే స్కెచ్ లు గీస్తున్నారు!!

CMR
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar