Bigg Boss 5 Telugu: హౌస్ నుండి బయటికి వచ్చిన జెస్సీ పై నెటిజన్ల పొగడ్తలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ జెస్సీ(Jessy) ఆదివారం హెల్త్ బాగోక హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నామినేషన్ లలో లేకపోయినా కానీ… మనోడు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో పాటు చికిత్స కంపల్సరి అని వైద్యులు తెలపడంతో.. హౌస్ నుండి జెస్సీనీ ఆదివారం బయటకు పంపించడం జరిగింది. చాలా వీక్ కంటెస్టెంట్ గా జెస్సీ ప్రారంభంలో అంచనా వేశారు. అంతమాత్రమే కాకుండా మొదటి వారమే ఇంటి నుండి ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని భావించారు. ఆ తర్వాత హౌస్ లో చాలామంది జెస్సీనీ టార్గెట్ చేస్తూ ఆడారు. ఈ క్రమంలో జెస్సీ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ.. హౌస్లో మహామహులకు మతిపోయే పోటీ ఇచ్చాడు.

jessie: Bigg Boss Telugu 5: Jaswanth aka Jessie to quit the house citing  health issues; watch him bidding an emotional farewell to Siri and other  housemates - Times of India

ఎవ్వరూ ఊహించని విధంగా హౌస్ లో ప్రతి విషయంలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ… వాగ్వాదం టైంలో కీలక పాయింట్ లేవనెత్తి అద్భుతమైన ఆట ప్రదర్శించాడు. ఫిజికల్ టాస్క్ లో కూడా… ఎవరూ ఊహించని రీతిలో రాణించాడు. ఇదే సమయంలో హౌస్ లో సిరి(Siri), షణ్ముక్(Shanmukh) తో మంచి బాండింగ్ ఏర్పరుచుకుని.. సీజన్ ఫైవ్ లో.. టాప్ ఫ్రెండ్స్ గా నిలిచారు. కాగా అద్భుతంగా జెస్సీ(Jessy)జర్నీ కొనసాగుతున్న సమయంలో.. వేర్టిగో వ్యాధి కారణంగా.. డల్ అవ్వటం తెలిసిందే. దీంతో మనోడు ఒకపక్క మెడిసిన్ తీసుకుంటూనే..గేమ్ ఆడుతూ ఉండగా.. అయినా కానీ రికవరీ కాని పరిస్థితి. అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా మరింత క్షీణించడంతో జెస్సీ నీ… గతవారం వైద్యుల పర్యవేక్షణలో పెట్టి ఆ తర్వాత సీక్రెట్ రూమ్ లో పెట్టడం జరిగింది.

Full Details - Jaswanth Padala Jessie 2021 Bigg Boss Telugu 5 Contestant

వీక్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి… వారియర్ గా

అయినా గాని పరిస్థితి బాగా లేకపోవడంతో ఆదివారం ఇంటి నుండి చికిత్స నిమిత్తం పంపించేశారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన జెస్సీకి సోషల్ మీడియా లో నెటిజెన్లు బ్రహ్మరథం పడుతున్నారు. వీక్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి… వారియర్ గా జెస్సీ మారాడని పొగుడుతూ ఉన్నారు. జెస్సీ చాలా జెన్యూన్ గేమ్ ఆడాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి… మాస్క్ లేకుండా గేమ్ ఆడుతూ సీజన్ లో రాణించాడు. ఫ్రెండ్షిప్ కి మంచి వ్యాల్యూ ఇచ్చాడు.. ఇంటి నుండి వెళ్తూ మరికొంతమందికి లైఫ్ ఇచ్చాడు.. నిజంగా చాలా మంది హృదయాలను జెస్సీ దోచుకున్నాడు అంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు బిగ్బాస్(Bigg Boss) అభిమానులు జెస్సీ ప్రయాణం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


Share

Related posts

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నోటిఫికేషన్

bharani jella

బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కావాలట!

somaraju sharma

బిగ్ బాస్ 4 : అభి పెళ్లి పై అతని తల్లి క్లారిటీ… ఆ అమ్మాయి తోనే అప్పుడే జరుగుతుంది

arun kanna