Bigg boss Avinash : బిగ్ బాస్ అవినాష్ Bigg boss Avinash పేరు చెబితేనే నవ్వొస్తుంది. ఎందుకంటే.. ఆయన పండించే కామెడీ అలా ఉంటుంది. అవినాష్ ఎక్కడ ఉంటే అక్కడ కామెడీనే. కామెడీకే కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు అవినాష్. బిగ్ బాస్ హౌస్ లో కూడా కామెడీని పండించి.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలాగే.. బిగ్ బాస్ 4వ సీజన్ కు ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా నాగార్జున చేతుల మీదుగా గెలుచుకున్నాడు అవినాష్.
అందుకే.. అవినాష్ కు ప్రస్తుతం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి బయట అడుగు పెట్టగానే అవినాష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలిసింది. తనకు చాలా కామెడీ షోల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ మాలో కామెడీ స్టార్స్ పేరుతో ప్రారంభం అయిన కామెడీ షోలో ప్రస్తుతం అవినాష్ టీమ్ లీడర్ గా చేస్తూనే ఇంకా కొన్ని షోలలో పాల్గొంటున్నాడు.
Bigg boss Avinash : డ్యాన్స్ ప్లస్ షో జడ్జిలను ఓ ఆట ఆడుకున్న అవినాష్
అయితే.. వాలెంటైన్స్ డే సందర్భంగా స్టార్ మాలో ప్రసారమయ్యే డ్యాన్స్ ప్లస్ షోలో కాస్త ఫన్ యాడ్ చేశారు. దాని కోసం అవినాష్ ను రంగంలోకి దించారు. పోస్ట్ మ్యాన్ గా డ్యాన్స్ ప్లస్ షోకు వచ్చిన అవినాష్.. అందరినీ తెగ నవ్వించేశాడు. జడ్జిలను మాత్రం ఆటపట్టించాడు. ముమైత్ ఖాన్, బాబా భాస్కర్ లను కూడా ఓ ఆట ఆడుకున్నాడు. మొత్తానికి డ్యాన్స్ ప్లస్ షోకు వచ్చి అవినాష్ చేసిన హంగామా చూడాలంటే మాత్రం ఈ వారం ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.