Bigg boss Avinash : బిగ్ బాస్ అవినాష్ గురించి తెలుసు కదా. జబర్దస్త్ తో కమెడియన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అవినాష్ జబర్దస్త్ తోనే ఫేమస్ అయిపోయాడు. తర్వాత తనకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో మనోడి రేంజే మారిపోయింది. బిగ్ బాస్ తో సెలబ్రిటీ అయిపోయాడు అవినాష్. అది అవినాష్ రేంజ్. ప్రస్తుతం ముక్కు అవినాష్ కాస్త.. బిగ్ బాస్ అవినాష్ అయిపోయాడు. మనోడికి చాలా షోలలో ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ మాలో వచ్చే కామెడీ స్టార్స్ షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు అవినాష్.

అవినాష్ చేతిలో ప్రస్తుతం చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాగే… తన అభిమానులతో టచ్ లో ఉండేందుకు ముక్కు అవినాష్ అనే చానెల్ ను కూడా ప్రారంభించాడు అవినాష్. తన యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ వీడియోలు, ఇతర వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు అవినాష్.
Bigg boss Avinash : జబర్దస్త్ పరదేశి యూట్యూబ్ చానెల్ కోసం పులిహోర వండిన అవినాష్
తాజాగా ముక్కు అవినాష్.. జబర్దస్త్ పరదేశి యూట్యూబ్ చానెల్ కోసం కష్టపడి మరీ పులిహోర వండాడు అవినాష్. తనకు పులిహోర కలపడమే కాదు…. పులిహోర చేయడం కూడా తెలుసని నిరూపించాడు అవినాష్.
నిజానికి అవినాష్ కు పులిహోర చేయడం రాదు కానీ.. భలే మేనేజ్ చేశాడు. తనకు నచ్చినట్టు వండేశాడు. దాన్ని తినలేక జబర్దస్త్ పరదేశి భలే తిప్పలు పడ్డాడు. ఇంకెందుకు ఆలస్యం.. ముక్కు అవినాష్ చేసిన పులిహోర వీడియోను మీరు కూడా చూసేయండి.