తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది బిగ్ బాస్ షో. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇదిలా ఉండగా మూడో సీజన్ లో హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళిన బ్యూటీ హిమజా సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ కు మంచి పాపులారిటీ పెరిగింది. అదేరీతిలో సోషల్ మీడియాలో ఫోటో షూట్ లతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంతగానో అలరించింది హిమజ.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న హిమజా హీరోయిన్ గా మారిపోయింది. ఓ హారర్ థ్రిల్లర్ ఈ నేపథ్యంలో వస్తున్న సినిమాలో హిమజా ప్రధానపాత్రలో నటిస్తోంది. ”జ” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయింది. సైది రెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తున్నారు. వేంగి సంగీతం అందిస్తుండగా జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న “ఆచార్య” సినిమాలో కూడా హిమజా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేరీతిలో టెలివిజన్ రంగంలో పలు టీవీ షోలలో బిజీబిజీగా గడుపుతోంది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లో సీజన్ త్రీ లో బలమైన కంటెస్టెంట్ గా రాణించిన హిమజా… బయటకు వచ్చాక మాత్రం మంచి పాపులారిటీ సంపాదించిన కెరియర్ ని సక్సెస్ ఫుల్ గా తీసుకెళుతుంది.