ట్రెండింగ్ న్యూస్

పెళ్లంటే భయం అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!!

Share

నాలుగో సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ తరహాలోనే మంచి పేరు సంపాదించిన కంటెస్టెంట్ సోహెల్ అని చెప్పవచ్చు. ముందు నుంచి హౌస్ లో మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ…మాస్క్ లేని గేమ్ ఆడి బయట మంచి పేరు సంపాదించాడు. అంతకుముందు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించినా కానీ పెద్దగా గుర్తింపు దక్కని సోహెల్ కి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస ఆఫర్లు వస్తున్నాయి.

BiggBossTelugu 4 Contestant ismart Syed Sohel Wiki, Biography, Age & Images  | Bigg Boss Telugu 4 | Telugu Bigg Bossముఖ్యంగా స్నేహం విషయంలో అదే విధంగా ఇతరులకు సహాయపడే విషయంలో సోహెల్ వ్యవహరించిన తీరు బిగ్ బాస్ ఆడియన్స్ ని మాత్రమేగాక టాలీవుడ్ కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ని కూడా ఆకట్టుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ లో మూడో స్థానంలో క్యాష్ ప్రైస్ గెలిచిన సోహెల్ బయట ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ మరోపక్క వచ్చిన డబ్బుతో చాలా వరకు ఇతరులకు సహాయం చేస్తున్నాడు.

 

దీనిలో భాగంగా ఓ వృద్ధాశ్రమం లోకి వెళ్ళిన సోహెల్ వాళ్లతో ముచ్చటించి యోగక్షేమాలు తెలుసుకున్న క్రమంలో .. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని సోహెల్ ని ప్రశ్నించారు. దీంతో సోహెల్ వెంటనే పెళ్లి అంటేనే భయమేస్తుంది. సంబంధాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం వయసు 28, ఇంకా రెండు మూడు సంవత్సరాలకు  పెళ్లి చేసుకుంటానని ఆ వృద్ధులకు తెలియజేశాడు.


Share

Related posts

Fruit Juice: ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నారా..!? ఈ తప్పులు చేయకండి..!!

bharani jella

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar