Bigg Boss 5 Telugu: అడుక్కోడానికి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టలేదు.. ఆ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదటి నుండి రసవత్తరంగా ఉంది. సూటిగా సుత్తి లేకుండా ఇంటిలో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోయేలా బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లు ఇవ్వటం మాత్రమే కాక.. కంటెస్టెంట్ ల మధ్య చిచ్చు పెట్టే రీతిలో రాణిస్తున్నారు. దీంతో ఐదో ఎపిసోడ్ కి వచ్చేసరికి.. హౌస్ లో ఎవరు కొత్త కెప్టెన్ అవుతారు అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇప్పటికే కెప్టెన్సీ బరిలో నలుగురు పోటీదారులు ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా హౌస్ లో నాలుగో ఎపిసోడ్ లో అందరూ వింటుండగా నే హౌస్ మధ్యలో… డైనింగ్ టేబుల్ వద్ద బిక్షమ్ ఎత్తుకోవడానికి హౌస్ లో అడుగు పెట్టలేదు… అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ డైలాగులు వేసింది మరెవరో కాదు సీరియల్ సీనియర్ నటి.. ఉమాదేవి. ఆలుగడ్డ కూర తనకి వేయకుండా దా చేయడంతో ఉమాదేవి.. ఇంటి సభ్యుల పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో యానీ మాస్టర్‌ సెకండ్‌ తినేవాళ్లకు కూర సరిపోవట్లేదని తానే ఆలూ కర్రీ ఫ్రిజ్‌లో పెట్టానని, కానీ ఆ విషయం మర్చిపోయానని చెప్పింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందని ఉమాదేవి.. అంటే దీనిప్రకారం మొదట కాకుండా సెకండ్‌ తినాలన్నమాట అని వ్యంగ్యంగా కౌంటరివ్వగా.. కలిసి తింటే సరిపోతుందని యానీ చెప్పింది. అయినా రెండు కూరలు ఎందుకు చేసుకోవడం? ఒకటే కూర చేసుకుని తింటే చాలని మండిపడింది. ఉమాదేవి తగ్గేలా లేదని అర్థమైన యానీ మాస్టర్‌ తనే ఓ మెట్టు దిగి సారీ చెప్పడంతో ఆమె కూల్‌ అయిపోయింది. అందరిలో కల్లా సీనియర్ కావడంతో.. పాటు వయసులో కూడా ఆమె వయసులో పెద్దది అవడంతో ఉమాదేవి వేసిన డైలాగులు.. ఇంటి సభ్యులకు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీంతో యాణీ మాస్టర్ … తప్పక కొంచెం తగ్గి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే తరుణంలో లహరి ఇంటిలో ఒక్కసారిగా ఏడ్చేసింది. కారణం చూస్తే హ మీద సరిగ్గా సమాధానం చెప్పటం లేదని.. రాష్ గా మాట్లాడుతూనే మరోపక్క ఇష్టానుసారంగా దురుసుగా వ్యవహరిస్తుంది అంటూ ఆమె మాట్లాడుతున్న మాటలు.. హర్ట్ అయ్యే విధంగా ఉన్నాయని నేనేమైనా వాళ్ళింట్లో పని చేస్తున్నానా అంటూ లహరి ఏడ్చేసింది.

లహరి కి గట్టిగా హమిదా హగ్..

ఈ క్రమంలో లో అంత సేపు అయిన తర్వాత లహరి నీ ఓదారుస్తు ఆమె దగ్గరకి వెళ్లడం జరిగింది. కొంతసేపయిన తర్వాత లహరి కి గట్టిగా హమిదా హగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే తరుణంలో.. మనాస్ .. తనని పదేపదే ప్రియాంక సింగ్ తో . ముడి పెట్టే దాన్ని బట్టి ఫీలయ్యాడు. దీంతో తన తల్లి వచ్చాక యాంకర్ రవి కి గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరుగుతుందని.. తన బాధను కాజల్ కి చెప్పుకొచ్చాడు. మరోపక్క నిన్న జరిగిన ఎపిసోడ్ లో లోబో చేత యూట్యూబ్ స్టార్ షణ్ముక్ మసాజ్ చేయించుకోవడం జరిగింది. టాస్క్ లో భాగంగా లోబో.. మసాజ్ చేయటం మాత్రమే కాక షణ్ముఖ బట్టలు కూడా ఉతకటం జరిగింది. ఈ టాస్క్ సిరి..లోబో కి ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా మళ్లీ ప్రతీకారం తీర్చుకుంటా అంటూ లోబో సంచలన డైలాగ్ వేశారు… మొత్తం మీద నాలుగో రోజు బిగ్ బాస్ హౌస్ లో.. ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ గొడవలు జరిగాయి.


Share

Related posts

YS Jagan: దేశంలో హిస్టరీ క్రియేట్ చేసిన జగన్ గవర్నమెంట్..!!

sekhar

బాబు కంట్లో నలుసుల్లా తయారైన ఇద్దరు కమలనాథులు!అందుకే టీడీపీ అనుకూల మీడియా ఏకిపారేస్తోందా?

Yandamuri

Breaking : రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్ధాల కలకలం

somaraju sharma