ట్రెండింగ్ లో గంగవ్వ బతుకమ్మ పాట

గంగవ్వ.. బిగ్ బాస్ లో వెళ్లడానికి ముందే తను ఫేమస్. మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ తో తను చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. సినిమా సెలబ్రిటీలతో కలిసి ముచ్చట్లు పెట్టింది. వాళ్లను ఇంటర్వ్యూ చేసింది.

Big Boss Fame Gangavva Bathukamma Song 2020
Big Boss Fame Gangavva Bathukamma Song 2020

తన స్వచ్ఛమైన పల్లెటూరు యాసలో మాట్లాడి అందరి మనసు దోచుకున్న గంగవ్వ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక ప్రపంచానికి పరిచయం అయింది. బిగ్ బాస్ హౌస్ లోనూ గంగవ్వ ఆటను బాగానే ఆడింది.

తనను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయకున్నా… తనకు ఆరోగ్యం బాగా లేక హౌస్ నుంచి బయటికి వచ్చేసింది గంగవ్వ.

ప్రస్తుతం గంగవ్వ బతుకమ్మ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. పాటల రచయిత కందికొండ తన యూట్యూబ్ చానెల్ లో గంగవ్వ బతుకమ్మ పాటను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది.

ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబురాలు జరుగుతున్న నేపథ్యంలో.. గంగవ్వ బతుకమ్మ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.