Bigg boss Gangavva : బిగ్ బాస్ గంగవ్వ తెలుసు కదా. బిగ్ బాస్ సీజన్ 4 లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తెలంగాణ యాసతో అందరినీ అలరించింది గంగవ్వ. తర్వాత తనకు అనారోగ్యం రావడంతో తప్పని పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. తను ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే బాగుండేది అని చాలామంది అనుకున్నారు. తన కోసమే బిగ్ బాస్ ను చూసిన వాళ్లు ఉన్నారు. తను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయినా… తను మాత్రం తన అభిమానులను అలరిస్తూనే ఉంది.

గంగవ్వకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది. మై విలేజ్ షో గంగవ్వ పేరుతో గంగవ్వ యూట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తోంది. ఆ యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ వీడియోలను పోస్ట్ చేస్తోంది గంగవ్వ. అలాగే మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ లోనూ యాక్ట్ చేస్తోంది.
Bigg boss Gangavva : కరోనా వ్యాక్సిన్ వేసుకొని ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పెట్టిన గంగవ్వ
ప్రస్తుతం కరోనా మనల్ని ఎంతలా భయపెడుతుందో అందరికీ తెలుసు కదా. గత సంవత్సరం నుంచి కరోనా అందరినీ హడలెత్తిస్తోంది. గత సంవత్సరం కరోనా వ్యాక్సిన్ లేదు కానీ… ఇప్పుడు మాత్రం కరోనా వ్యాక్సిన్ వచ్చింది. 45 సంవత్సరాలు పైబడిన వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.
తాజాగా… గంగవ్వ కూడా తన ఊరికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. అలాగే.. అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరింది. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది గంగవ్వ. ఇంకెందుకు ఆలస్యం… గంగవ్వ కరోనా వ్యాక్సిన్ ను ఎలా వేసుకుందో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.