Bigg boss Gangavva : బిగ్ బాస్ గంగవ్వ.. గురించి తెలుసు కదా. మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ లో పాపులర్ అయిన గంగవ్వ… తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఫుల్ టు పాపులర్ అయిపోయింది. నిజానికి… గంగవ్వ.. బిగ్ బాస్ కంటే ముందే ఫేమస్ కానీ… బిగ్ బాస్ తర్వాత ఆ ఫేమ్ కాస్త పెరిగింది. తన రేంజ్ పెరిగింది. ప్రస్తుతం తను ఒక సెలబ్రిటీ. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలోనూ పార్టిసిపేట్ చేస్తోంది. అలాగే.. తన సొంత యూట్యూబ్ చానెల్ లోనూ వీడియో చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటోంది.

అయితే… ఇటీవల గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ లో ఓ వీడియోను పెట్టింది. అది కూడా మామూలు వీడియో కాదు. బిగ్ బాస్ హోస్ట్, కింగ్ నాగార్జునతో గంగవ్వ ముచ్చటించిన వీడియో.
గంగవ్వ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఇప్పటి వరకు నాగార్జునను కలవలేదు. బిగ్ బాస్ తర్వాత నాగార్జున కూడా వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయారు.
వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా… గంగవ్వతో నాగార్జున భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు.
Bigg boss Gangavva : కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకున్న నాగ్, గంగవ్వ
చాలా రోజుల తర్వాత కలవడంతో… ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. కొంచెం సేపు బిగ్ బాస్ ముచ్చట్లు.. ఆ తర్వాత వైల్డ్ డాగ్ సినిమా ముచ్చట్లు చెప్పుకున్నారు.
దానికి సంబంధించిన వీడియోను గంగవ్వ… తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా వాళ్ల ముచ్చట్లను చూసేయండి.