ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Harika : బిగ్ బాస్ హారిక నటించిన ‘ఏవండోయ్ ఓనర్ గారు’ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

bigg boss harika evandoi owner garu trailer
Share

Bigg Boss Harika : బిగ్ బాస్ హారిక తెలుసు కదా…. తననే దేత్తడి హారిక అని కూడా అంటారు. బిగ్ బాస్ హారిక ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. బిగ్ బాస్ 4వ సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి అదరగొట్టేసింది హారిక. తను చూడటానికి చాలా అమాయకంగా కనిపించినా… తనలో ఫైర్ మాత్రం మామూలుగా ఉండదు. ఇచ్చి పడేస్తది హారిక. తెలంగాణ యాసలో తను మాట్లాడే డైలాగ్స్ మామూలుగా ఉండవు. ఎంతైనా హారిక హారికే. తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు.. బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లకే కాదు… బయట ఉన్న ప్రేక్షకులకు కూడా తను ఫేవరేట్ కంటెస్టెంట్.

bigg boss harika evandoi owner garu trailer
bigg boss harika evandoi owner garu trailer

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక… అప్పుడప్పుడు కొన్న టీవీ షోలలో కనిపించింది కానీ… హారిక ఇప్పటి వరకు ఏ మూవీకి కానీ… ఏ ప్రోగ్రామ్ కి కానీ… ఏ వెబ్ సిరీస్ కు కానీ సైన్ చేయలేదు. తన యూట్యూబ్ చానెల్ దేత్తడిలోనూ అంతగా యాక్టివ్ గా లేదు.

కానీ… ప్రస్తుతం సాలీడ్ గా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఏవండోయ్ ఓనర్ గారు… అంటూ వస్తున్న ఓ వెబ్ సిరీస్ లో హారిక నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ఓసీడీ ఉన్న ఇంటి ఓనర్ గా హారిక నటిస్తోంది. తన దేత్తడి చానెల్ లోనే ఏవండోయ్ ఓనర్ గారు వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది.

Bigg Boss Harika : టాప్ 5 ట్రెండింగ్ లో ఏవండోయ్ ఓనర్ గారు ట్రైలర్

దేత్తడి చానెల్ లో హారిక… ఏవండోయ్ ఓనర్ గారు ట్రైలర్ ను రిలీజ్ చేసిందో లేదో.. యూట్యూబ్ లో ఆ ట్రైలర్ సంచలనాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ 5 ట్రెండింగ్ లో ఉంది. లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. హారిక అభిమానులైతే ఇక తమ ఆనందాన్ని పట్టలేకపోతున్నారు. హారిక.. సాలీడ్ గా ఇచ్చి పడేసేందుకు రెడీ అయిపోయింది అని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోందని అంటున్నారు. మొత్తానికి హారిక బిగ్ బాస్ తర్వాత రీఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా బిగ్ బాస్ హారిక నటించిన ఏవండోయ్ ఓనర్ గారు ట్రైలర్ చూసేయండి.


Share

Related posts

మెగా కోడలు అనిపించుకున్న ఉపాసన..!!

sekhar

Mahesh: రిలీజ్ అయ్యే వరకు సర్కారు వారి పాట విషంలో మేకర్స్‌కు టెన్షన్ తప్పదా..?

GRK

తెలంగాణ ఇంటెలిజెన్స్ కు ఊపిరి సలపనంత పని!ఎందుకంటే ఇందుకు!!

Yandamuri