Bigg boss Harika : బిగ్ బాస్ హారిక Bigg boss Harika గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ హారికకు ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. దేత్తడి అనే ఒక చానెల్ తో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించి.. సోషల్ మీడియా స్టార్ అయిపోయింది హారిక. దేత్తడి హారికలా ఫేమస్ అయిపోయిన హారిక.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక.. ఇంకా పాపులర్ అయిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందరూ హారిక గురించే మాట్లాడుకునేవాళ్లు. హౌస్ లోనూ హారిక చేసిన సందడి మామూలుగా లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చాక హారికకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. ఆఫర్లు క్యూ కడుతున్నాయి. హారికతో పాటు.. వాళ్ల అమ్మ కూడా ఫేమస్ అయిపోయింది.
Bigg boss Harika : బిగ్ బాస్ హారిక కు బిగ సర్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ల అమ్మ
హారిక తల్లికి కూడా ప్రస్తుతం ఫాలోవర్స్ పెరగడంతో.. తన తల్లి Captain Mom అనే పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది. ఆ చానెల్ లో హారిక గురించి, తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అయితే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక.. హారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కదా. తాజాగా హారికకు ఇన్ స్టాగ్రామ్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ వచ్చారట. అంటే 10 లక్షల మంది ఫాలోవర్స్ అన్నమాట. దీంతో హారికకు చెప్పకుండా సర్ ప్రైజ్ పార్టీని అరేంజ్ చేశారు హారిక కుటుంబ సభ్యులు.
దాన్ని వీడియో తీసి తాజాగా కెప్టెన్ మామ్ యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా హారిక వన్ మిలియన్ ఫాలోవర్స్ సెలబ్రేషన్స్ వీడియోను చూసేయండి.