Bigg boss Himaja : బిగ్ బాస్ హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా అంటే పాషన్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హిమజ.. ముందు బుల్లితెరకు పరిచయం అయింది. సీరియల్ లో నటించి… ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో కూడా ఆపర్లు తెచ్చుకొని సెలబ్రిటీలా అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో తన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. తన చేతినిండా బోలెడు ఆఫర్లు ఉన్నాయి. ఓవైపు టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తూనే… సినిమాల్లోనూ నటిస్తోంది.

అలాగే… తనకు సొంత యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఇట్స్ హిమజ అనే చానెల్ ఉంది. ఆ చానెల్ ద్వారా తను తన పర్సనల్ వీడియోలను అప్ లోడ్ చేస్తుంటుంది. ఏదైనా ఈవెంట్ కు వెళ్లినా… ఆ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తుంటుంది. ఈవెంట్ కోసం తను ఎంత కష్టపడుతుంది… డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తుంది… ఇలా అన్ని వీడియోలను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేస్తుంది హిమజ.
Himaja : రామోజీ ఫిలిం సిటీలో హోళీ ఈవెంట్ కోసం డ్యాన్స్ షూటింగ్
అయితే… బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు… జబర్దస్త్ కంటెస్టెంట్లు అందరూ కలిసి ఈటీవీ ప్రోగ్రామ్ రంగు పడుద్ది కోసం స్పెషల్ గా హోళీ పాటకు స్టెప్పులేశారు. దానికి సంబంధించిన షూటింగ్ కోసమే హిమజ… రామోజీ ఫిలిం సిటీకి వెళ్లింది. రామోజీ ఫిలిం సిటీలో హోళీ పాటకు డ్యాన్స్ వేసి…. అందరూ కలిసి అక్కడే హోళీ ఆడుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.