Bigg Boss 5 Telugu: యాంకర్ రవి ని వదలని గుంట నక్క..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో భారీ క్రేజ్ కలిగిన కంటెస్టెంట్ యాంకర్ రవి(Anchor Ravi). టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా అలరించిన రవి… పెద్ద పెద్ద పేరుగాంచిన అవార్డుల కార్యక్రమాలలో కూడా యాంకరింగ్ చేయడం జరిగింది. దీంతో మనోడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడంతో… సీజన్ ఫైవ్ చూడటానికి చాలా మంది ఇష్టపడ్డారు. రవి ఆటతీరుపై భారీ అంచనాలు బయట జనాలు పెట్టుకున్నారు. కానీ మనోడు ఆడిన ఆట తీరు అంచనాలను తలకిందులు చేస్తూ.. అట్టర్ ఫ్లాప్ చేసినట్లయింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో… స్ట్రాటజీ లు తప్ప.. మనోడు గేమ్ ఆడటానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా.. బయట ఉన్న అంచనాల కంటే మరీ దారుణంగా రవి వ్యవహరించడం జరిగింది. హౌస్ లో మొదటినుండి స్ట్రాటజీలు వేయడనికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. వేసిన స్ట్రాటజీలు కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో… కెమెరాల ముందు అడ్డంగా బుక్ అవుతూ ఉండటంతో… మనోడు క్రేజ్ మసకబారే పరిస్థితి బయట ఏర్పడింది.

Netizens Trolling Anchor Ravi Why Because Biggboss 5 Telugu Nagarjuna  Netizens Lahari Priya Rality Show - Interesting Facts N-TeluguStop

పరిస్థితి ఇలా ఉంటే రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నటరాజ మాస్టర్(Nataraj Master) యాంకర్ రవి (Anchor Ravi)కి పెట్టిన గుంటనక్క టైటిల్.. ప్రతి వీక్ ఎండ్ వెంటాడుతూనే ఉంది. బయట ఎంతో క్రేజ్ ఉన్న రవి.. నటరాజ్ మాస్టర్ పెట్టిన టైటిల్ కి.. తెగ సతమతమవుతూ ఉన్నాడు. నాలుగో వారం ఇంటి నుండి నటరాజు మాస్టర్ ఎలిమినేట్ అయినా గాని… వారాంతపు ఎపిసోడ్ లలో.. నాగార్జున(Nagarjuna) రవి ని ఉద్దేశిస్తూ గుంటనక్క.. పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. చాలావరకు రవి వేసే స్ట్రాటజీ లు… కెమెరాల ముందు అడ్డంగా దొరుకుతూ ఉండటంతో.. మనోడి ని బయట సోషల్ మీడియాలో కూడా జనాలు భారీగా ఏడిపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఏడు వారాలు ముగిసిన బిగ్ బాస్ సీజన్.. ఎనిమిదోవ వారంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సండే ఎపిసోడ్ లో యాంకర్ రవి కి బిగ్బాస్ జిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. విషయంలోకి వెళితే ఏడో వారం కెప్టెన్సీ కంటెస్టెంట్ టాస్క్ … బంగారు కోడిపెట్ట టాస్క్ లో… మిస్సెస్ ప్రభావతి.. అనే కోడి సెట్టింగ్ తెలిసిందే.

Anchor Ravi: ర‌విపై మ‌ళ్లీ ఫైర్ అయిన నాగార్జున‌.. డేంజ‌ర్ జోన్‌లో ఆ  ముగ్గురు | The News Qube

 

ఈ క్రమంలో మెసేజ్ ప్రభావతి దగ్గరికి ఇంటిలో ఉన్న సభ్యులు వెళ్ళినా క్రమంలో కొన్ని జంతువుల సౌండ్ అరుస్తూ ఉంటది. ఈ తరుణంలో యాంకర్ రవి వెళ్ళిన క్రమంలో మిస్సెస్ ప్రభావతి కోడిపెట్ట… నక్క అరుపు రావడంతో ఒక్కసారిగా .. ఇంట్లో జనాలు మొత్తం గట్టిగా కేకలు వేశారు. రవి మొహం చూస్తే మళ్లీ కొంత నక్క నన్ను వెంటాడుతూనే ఉంది… అన్న రీతిలో తలదించి వేయడం జరిగింది. ప్రతి ఆదివారం రవికి బిగ్ బాస్ లో ఏదో రూపంలో గుంటనక్క టాపిక్.. ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రవిని అభిమానించే వాళ్లు అనవసరంగా బిగ్ బాస్ హౌస్ లో రవి వెళ్లాడని.. అంటున్నట్లు బయట టాక్. ప్రతిసారీ స్ట్రాటజీ వేసి అమ్మతోడు అంటూ రవి.. చీప్ ట్రిక్.. గేమ్స్ ఆడుతూ ఉండటంతో.. రవి ఆటతీరుపై బయట జనాలు మండిపడుతున్నారు. అప్పట్లో లహరి… ప్రియా ఆంటీ గొడవ జరిగిన సమయంలో కూడా అమ్మ తోడు అంటూ… బుకాయించడం జరిగింది. లహరి దగ్గర ఒక లాగా ప్రియ ఆంటీ దగ్గర మరొక లాగా మాట్లాడిన..రవి… వీడియో లో అడ్డంగా బుక్కయిన..టైం లో… నాగార్జున ముందే అడ్డంగా అబద్ధాలు ఆడుతూ దొరికిపోయాడు. అయితే ఇప్పటికి కూడా.. అదే ఆటతీరు రవి ఆడుతూ ఉండటంతో.. కెరియర్ పరంగా అతని ఇమేజ్ అతనే బిగ్ బాస్ హౌస్ లో వచ్చి చెడగొట్టుకున్నాడని బయట జనాలు అనుకుంటున్నారు.


Share

Related posts

ఈ సంఘటన దేనికి సంకేతం ?

Yandamuri

అటు తిరిగి… ఇటు తిరిగి…జీవన్ రెడ్డి వద్దకు వచ్చి ఆగిన తెలంగాణ పిసిసి కుర్చీ?

Yandamuri

Bad Cholesterol: కొవ్వు కరిగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? ఇవి తింటే కరుగుతుంది..

bharani jella