బిగ్ బాస్ హౌస్ లో అందరికీ నచ్చే కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే కచ్చితంగా గంగవ్వ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ వీక్ లో చాలా నీరసంగా కనబడినా గంగవ్వ తర్వాత మెల్లగా వాతావరణానికి అలవాటు పడినట్టు ప్రస్తుతం చెలరేగి పోతుంది. హౌస్ లో తనతో ఉన్న వాళ్ళ వయసు కుర్రతనం గా ఉన్నాగాని గంగవ్వ చాలా తెలివిగా గేమ్ ఆడుతూ ఉంది. అంతే కాకుండా హౌస్ కి కెప్టెన్ కూడా అయింది.
ఇదిలా ఉండగా హౌస్ లో గంగవ్వ పై ఇంటి సభ్యులు చూపిస్తున్న ప్రేమ అంతా ప్రేక్షకుల సానుభూతి సంపాదించుకోవడానికి ఆడుతున్న డ్రామా అని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు అంటున్నారు. తాజాగా కరాటే కళ్యాణి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక బయట పలు చానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ హౌస్ గురించి రకరకాల కామెంట్లు చేస్తుంది.
ఈ తరుణం లో గంగవ్వ గురించి మాట్లాడుతూ…. బిగ్ బాస్ గేమ్ లో గంగవ్వ కూడా ఒక పార్ట్ అని తెలిపింది. హౌస్ లో ఉన్న వాళ్లంతా మాస్కు పెట్టుకొని ఆడుతున్నారని ఆ విధంగా తనకు ఆట ఆడటం రాదు అని తెలిపింది. గంగవ్వ కూడా అదేరీతిలో ఆడుతున్నట్లు స్పష్టం చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఏదిఏమైనా రెండు నెలలపాటు గంగవ్వ ఉండటం గ్యారెంటీ అని ఇది కాంట్రాక్ట్ అని కరాటే కళ్యాణి పరోక్ష వ్యాఖ్యలు చేసింది.