ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4 : అఖిల్ ను బుక్ చేసేశారు.. అమ్మాయిలందరికీ పులిహోర కలుపుతున్నాడట..?

bigg boss lady contestants target akhil in bigg boss house
Share

నో డౌట్.. బిగ్ బాస్ హౌస్ లో అందగాడంటే అఖిలే. అఖిల్ తర్వాతి ప్లేస్ లో సోహెల్, ఆ తర్వాత అభిజీత్ ఉంటాడు. నిజానికి ఈ సీజన్ ప్రారంభం కాగానే.. ముందుగా అఖిల్ కు పడిపోయింది మోనాల్. ఆ తర్వాత హారిక కూడా పడిపోయింది. కాకపోతే.. ఎక్కువగా అఖిల్.. మోనాల్ తో ఉండటంతో హారిక అభిజీత్ తో కనెక్ట్ అయింది.

bigg boss lady contestants target akhil in bigg boss house
bigg boss lady contestants target akhil in bigg boss house

అఖిల్ అంటే అరియానాకు కూడా ఇష్టమని ఈ మధ్యనే తెలిసింది. అరియానా కూడా తన మనసులో మాటను బయటపెట్టింది. ఈమధ్య హారికతోనూ అఖిల్ ఎక్కువగా క్లోజ్ అవుతున్నాడు. హగ్గులు.. ఇంకేవో జరుగుతున్నాయి.

ఈ విషయం హోస్ట్ నాగార్జునకు కూడా తెలిసింది. అందుకే.. అసలు హౌస్ లో ఏం జరుగుతోందంటూ ఇంటి సభ్యులను అడిగాడు. అఖిల్.. హగ్గులు.. గిగ్గులు అనే సరికి.. అవును సర్.. వాళ్ల హగ్గులు చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు అంటూ మోనల్ అనడం.. ఈ హౌస్ లో పులిహోర రాజా అంటే అఖిలే అంటూ హారిక చెప్పడంతో.. బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు విరబూశాయి.

చూడటానికి సైలెంట్ గా ఉన్నా అఖిల్ చిన్నోడేమీ కాదు.. అమ్మాయిలతో పులిహోర బాగానే కలుపుతాడు అనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది లేడీ హౌస్ మేట్స్ కు. మొత్తం మీద ఈ సండే కూడా ఫన్ డే గా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది.

అయితే.. ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్తారు అనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అయితే మోనల్ ఎలిమినేట్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. కొందరేమో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అంటున్నారు. అసలు ఎవరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారో తెలియాలంటే మాత్రం ఆదివారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఈ ప్రోమో చూసేయండి.


Share

Related posts

Jabardasth : ఎమ్మెల్యే రోజాపై అదిరే అభి కుళ్లు జోకులు.. ఏంటి అభి.. నువ్వింకా ఎదగాలి?

Varun G

Nara Family: ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూప్’ కార్డు..! అలా ప్రింటేసారా..?

Muraliak

 జగన్ నెత్తిన కొండంత భారం .. పిడుగుగా మారేముందే జాగ్రత్తపడాలి !

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar