ట్రెండింగ్ న్యూస్

Bigg boss Lasya : కామెడీ స్టార్స్ సెట్ లో బిగ్ బాస్ లాస్య సందడి? యాంకర్ రవితో బేబమ్మలా నటించిన లాస్య?

bigg boss lasya in comedy stars set
Share

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య Bigg boss Lasya గురించి తెలుసు కదా. తను బిగ్ బాస్ తర్వాత ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలుసు. బిగ్ బాస్ లాస్య కంటే కూడా యాంకర్ లాస్యగా తను ఎక్కువ గుర్తింపు పొందినా.. పెళ్లి తర్వాత యాంకరింగ్ కెరీర్ ను లాస్య వదిలేసుకుంది. చాలా ఏళ్ల పాటు.. సినిమా ఇండస్ట్రీకి లాస్య దూరం అయిపోయింది.

bigg boss lasya in comedy stars set
bigg boss lasya in comedy stars set

కానీ.. బిగ్ బాస్ తో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది లాస్య. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తనకు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. తన జున్ను కోసం తను బిగ్ బాస్ హౌస్ లో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు.. చాలామంది తనది ఫేక్ నవ్వు అంటూ నిందించడం.. తను ఏ టాస్క్ సరిగ్గా ఆడదు.. అంటూ తనపై ఎన్ని అభాండాలు మోపినా.. తను మాత్రం తన ఆట తను ఆడుతూ వెళ్లింది. అందుకే.. తను చాలామందికి ఫేవరేట్ కంటెస్టెంట్ అయింది.

ఏది ఏమైనా.. బిగ్ బాస్ తర్వాత లాస్య ఫుల్ బిజీ అయిపోయింది. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయడం లేదు. లాస్య టాక్స్ పేరుతో యూట్యూబ్ చానెల్ ను నిర్వహించడంతో పాటు.. పలు టీవీ షోలలోనూ పార్టిసిపేట్ చేస్తోంది.

Bigg boss Lasya : యాంకర్ రవితో కలిసి స్కిట్ చేసిన లాస్య

తాజాగా కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో యాంకర్ రవితో కలిసి ఓ స్కిట్ చేసింది లాస్య. ఇద్దరూ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విషయం అందరికీ తెలుసు. తాజాగా యాంకర్ రవితో కలిసి ఉప్పెన సినిమా స్పూఫ్ ను చేశారు. బేబమ్మలా లాస్య నటించగా.. ఆశీర్వాదంగా రవి నటించాడు. మొత్తానికి ఇద్దరూ మరోసారి కలిసి సరదాగా స్కిట్ చేయడంతో.. బుల్లితెర ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తను కామెడీ స్టార్స్ సెట్ కు వెళ్లడం.. మేకప్ వేసుకోవడం.. షూటింగ్ లో పాల్గొనడం.. అన్నింటికి సంబంధించిన వీడియోను తాజాగా లాస్య.. తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.


Share

Related posts

Ink: ఎన్నికల్లో వేసే సిరా గుర్తు గురించి ఈ విషయాలు తెలుసుకోండి!!

Kumar

పని ఒత్తిడి తో తినడానికి సమయం ఉండడం లేదా అయితే ఇలా చేయండి!!

Kumar

Janasena ; పవన్ పంజా విసిరినట్టేనా..!? పంచాయతీ ఎన్నికల్లో మీడియా దాచిన నిజాలు..!!

Srinivas Manem