Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య Bigg boss Lasya గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లాస్య.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం లాస్యకు ఉన్న ఫ్యాన్ బేస్ మామూల్ది కాదు. బిగ్ బాస్ కు ముందు లాస్య అంటే తక్కువ మందికే తెలుసు కానీ.. బిగ్ బాస్ తర్వాత మాత్రం లాస్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. తెలుగు రాష్ట్రాల్లో తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించిన లాస్య.. సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది.
Bigg boss Lasya : వాలంటైన్స్ డే సందర్భంగా తమ లవ్ స్టోరీ బయటపెట్టిన లాస్య
అయితే.. లాస్య లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలుసు. తను యాంకర్ గా ఉన్నప్పుడు తన మీద ఎన్ని గాసిప్స్ వచ్చాయో అందరికీ తెలుసు. అసలు.. తనకు పెళ్లి అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఓవైపు యాంకరింగ్ చేస్తూ తనకు పెళ్లి అయింది.. అది కూడా లవ్ మ్యారేజ్ అని లాస్య దాచింది. తర్వాత తనకు ప్రెగ్నెన్సీ రావడంతో… యాంకరింగ్ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టింది. అప్పుడు తెలిసింది లాస్యకు పెళ్లయింది అని.
ఆ తర్వాత జున్ను పుట్టడం.. తన సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయడం, బిగ్ బాస్ లోకి వెళ్లడం అన్నీ అందరికీ తెలిసిందే. అయితే.. లాస్య, మంజునాథ్ ను ఎలా ప్రేమించింది.. అతడు తనకు ఎక్కడ పరిచయం అయ్యాడు.. అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ హౌస్ లో తన లవ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నా.. మొత్తం తెలియదు.
అందుకే.. వాలంటైన్స్ డే సందర్భంగా తన అభిమానులకు లాస్య తన లవ్ స్టోరీ చెప్పి పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. మా ప్రేమ కథ అంటూ లాస్య, మంజునాథ్.. ఇద్దరూ కలిసి… వాళ్ల లవ్ స్టోరీని తమ అభిమానులతో పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వాళ్ల లవ్ స్టోరీని చూసేయండి.