Bigg Boss 5 Telugu: గత నాలుగు సీజన్లలో ఏ కంటెస్టెంట్ చేయని పని బిగ్ బాస్ హౌస్ లో చేసిన లోబో..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ కోసం ఇంటి సభ్యులకు తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్… “గెలవాలంటే తగ్గాలి”. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఇద్దరు ఇద్దరు గా జట్లుగా విడదీయడం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ లో ఫుడ్ ఐటమ్స్ మొత్తం బిగ్ బాస్ మాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటిలో ఉన్న 16 మంది సభ్యులు… హౌస్ లో ఆకలికేకలు పెడుతున్నారు. దాచుకున్న ఫుడ్ ఐటమ్స్ కూడా.. బిగ్ బాస్ ఇచ్చేయమని చెప్పటంతో.. హౌస్ మేట్స్ దాచుకున్న ఫుడ్ దానం చేసేశారు. ఇటువంటి తరుణంలో… ఇంటిలో మొదటి నుండి ఆకలికి తట్టుకోలేని క్యాండెట్ లోబో.. ఒక దారుణమైన పని హౌస్లో చేశాడు. ఇప్పటి వరకు… అన్ని సీజన్లలో ఇంటిలో ఏ క్యాండెట్ చేయని పని..లోబో చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే.. కిచెన్ దగ్గరకు ఎవరు లేని టైం లో… వేస్ట్ మెటీరియల్ పడేసే చెత్తబుట్ట వద్దకు వెళ్లి .. ఆ క్యారీ బ్యాగ్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ వెతుకుతూ.. కెమెరా కంట పడ్డారు.

తాజాగా ఈ వీడియో ప్రోమో లో రిలీజ్ కావడంతో… నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇంటి సభ్యులు కూడా లోబో చేసిన పనికి.. మైండ్ పోయినట్లు అయింది. మరోపక్క లోబో… ఈవారం నామినేషన్ లో.. ఉండటంతో సింపతి సంపాదించడానికి కెమెరాల ముందు..ఈ గేమ్ ట్రిక్ ప్లే చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. ప్రతిసారి ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో బస్తీకి చెందిన వాడిని, బ్యాక్ గ్రౌండ్ లేనివాడిని.. అంటూ కబుర్లు చెప్పే లోబో… ఈసారి తనతోపాటు నామినేషన్ ల లో ఉన్న.. మిగతా ఇంటి సభ్యులు… చాలావరకు స్ట్రాంగ్ కావడంతో ఎక్కువగా తోనే ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో..లోబో సానుభూతి గేమ్ హౌస్ లో ప్లే చేస్తున్నాడు అని బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది అంటే అది కేవలం …లోబో వల్లే అని చెప్పుకొస్తున్నారు.

Bigg Boss Telugu 5: Lobo gets caught smoking again

ఫుడ్ విషయంలో.. హౌస్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్

కాంట్రవర్సి వ్యాఖ్యలు చేసే కంటెస్టెంట్ లు మెల్లమెల్లగా ఎలిమినేట్ కావటం తో ఇప్పటికే హౌస్ ..లో పెద్ద కంటెంట్ కలిగిన కంటెస్టెంట్ లో ఎవరూ లేరని, అంతా చప్పిడి గేమ్ ఆడుతున్నారని..లోబో ఉండటం వల్లే ఈ సీజన్లో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ హౌస్ లో ఉందని.. బయట జనాలు అంటున్నారు. ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లో ఫుడ్ విషయంలో.. హౌస్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని పలువురు ఇంటర్వ్యూలలో చెప్పు కు రావడం జరిగింది. రెండవ వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి.. కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు.

లోబో కి బాగా ఆకలి ఎక్కువ

ఆలూ కర్రీ గొడవ కి సంబంధించి ఫుడ్ విషయంలో.. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..లోబో కి బాగా ఆకలి ఎక్కువ  పైగా నాన్ వెజిటేరియన్. తిండి విషయంలో అతడు తట్టుకోలేక పోతున్నాడు. అతనేకాదు ఇంటిలో ఫుడ్ విషయంలో.. ఇంటి సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని.. తెలపడం జరిగింది. సిగరెట్ల విషయంలో కూడా… రోజుకి 10 సిగరెట్లు మాత్రమే ఇవ్వటం వల్ల లోబో.. ఆరోగ్య రీత్యా అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు ఉమాదేవి చెప్పుకొచ్చారు. కాగా తాజాగా నాలుగో వారంలో  బిగ్ బాస్ హౌస్ లో…ఫుడ్ కోసం లోబో.. చెత్తబుట్ట వద్దకు వెళ్లి వెతుక్కోవటం.. కెమెరాల కంటబడటం ఇప్పుడది హైలెట్ గా మారింది. ఈ సన్నివేశం చూసిన చాలామంది నెటిజన్లు మరీ ఇంత దారుణంగా బిగ్ బాస్.. ఇంటిలో ఉన్న సభ్యుల చేత ఆకలి కేకలు పెట్టించకూడదని మండిపడుతున్నారు.


Share

Related posts

గ్రూప్ -1 పరీక్షలు నిలిపివేయాలంటూ ఆందోళన

somaraju sharma

శివప్రసాద్ చనిపోలేదు..

Mahesh

మంత్రి నివాసంలో ఐటి సోదాలు

sarath