Bigg Boss 5 Telugu: అదిరిపోయిన నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్..!!

Share

Bigg Boss 5 Telugu: దసరా పండుగ నేపథ్యంలో నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో పండుగ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ దుస్తులలో.. ఇంటిలో ఉన్న సభ్యులు ఆకట్టుకున్నారు. మరోపక్క నాగార్జున కూడా తన డ్రెస్ సెన్స్ తో అదరగొట్టేసారు. నవరాత్రి సందర్భంగా 9 ఆటలకు 9 అవార్డులు ఇస్తున్నట్లు.. ప్రకటించిన నాగార్జున రెండు A,B టీములు గా ఇంటి సభ్యులనీ డిలీట్ చేయడం జరిగింది.

A టీమ్‌లో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్‌, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు B టీమ్‌లో ఉంటారు. పెట్టిన గేమ్స్ లో రవి టీం ఎక్కువ గెలవడం జరిగింది. ఎక్కువ సీట్లు తినటం, రింగ్ గేమ్, ప్రశ్నలు జవాబులు ఇలా రకరకాల గేమ్స్ ఆడుతూ మధ్యలో ఇంటి సభ్యుల… కుటుంబ సభ్యుల వీడియోలను ప్లే చేసి వారు ఆడుతున్న ఆట తీరు గురించి వాళ్ళు ఏమంటున్నారు… వీడియోలు ప్లే చేయడం జరిగింది.

హేబా పటేల్ డాన్స్

ఈ క్రమంలో ఇంటిలో సభ్యులు చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు నెల రోజులకు పైగానే ఇంటికి దూరంగా ఉండటంతో.. వీడియో ప్లే అవగానే చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో మంగ్లి డాన్స్ వేయడం తో పాటు… ఇండస్ట్రీ హాట్ బ్యూటీ.. హేబా పటేల్.. స్పెషల్ సాంగ్ లో తన ఘాటైన అందాలతో డాన్స్ దుమ్ము రేపింది. ఏది ఏమైనా నవరాత్రుల ఎపిసోడ్.. సెన్సేషనల్ గా నిలిచింది. యాంకర్ రవి తన కూతురు మాట్లాడిన సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఈ తరుణంలో రవి ఆడటం చూసిన నాగార్జున కూడా షాక్ అయిపోయారు. ఏది ఏమైనా.. బిగ్ బాస్ హౌస్ లో నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్… చాలా హైలెట్ గా నిలిచింది.


Share

Related posts

Kondapolam Review: ‘కొండపొలం’ మూవీ రివ్యూ

siddhu

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ..! ఎందుకంటే..!?

somaraju sharma

Jabardasth Immanuel : నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న… అంటున్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్?

Varun G