Bigg boss Noel : బిగ్ బాస్ నోయెల్ Bigg boss Noel గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బిగ్ బాస్ లోకి రాకముందే నోయెల్ చాలా ఫేమస్. సినిమాల్లోనూ నటించాడు. రాప్ సాంగ్స్ సింగర్ గా ఫేమస్ అయ్యాడు నోయెల్. నోయెల్ రాప్ సాంగ్స్ పాడితే మామూలుగా ఉండదు. అందుకే నోయెల్ కు బిగ్ బాస్ లోనూ చాన్స్ వచ్చింది. నిజానికి బిగ్ బాస్ 4 విజేత నోయెలే కావాల్సింది కానీ.. బిగ్ బాస్ హౌస్ లో నోయెల్ కాలికి అయిన గాయం వల్ల నోయెల్ బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
నోయెల్ ఇప్పటి వరకు ఎన్నో ఆల్బమ్స్ చేశాడు. అన్నీ సూపర్ హిట్. అందుకే.. తాజాగా మరో ముందడుడు వేసి మారదే మారదే అనే సాంగ్ ను పాడాడు. ఇదే సాంగ్ ను ఇటీవల బీబీఉత్సవంలోనూ నోయెల్ పాడి అందరి మనసును గెలిచాడు.
Bigg boss Noel మారదే మారదే సాంగ్
నోయెల్ తో పాటు ప్రవల్లిక దామెర్ల నటించిన మారదే మారదే సాంగ్ ప్రోమోను తాజాగా నోయెల్ తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశాడు. పాట విడుదలైన వెంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా? మారదే మారదే ఈ ప్రేమ.. మనసెంత గాయపడినా.. తీరదే తీరదే ఈ ప్రేమ.. తీరాలు దాటి వెళ్లినా.. అంటూ ప్రోమోలో వచ్చే సాంగ్ అదిరిపోయింది. లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ సాంగ్ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ సాంగ్ కావాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.