ట్రెండింగ్ న్యూస్ సినిమా

Noel Sean : నోయెల్ సేన్ కొత్త ఆల్బమ్ సాంగ్ చూస్తే ఏడ్చేస్తారు?

Noel Sean నోయెల్ సేన్ కొత్త ఆల్బమ్ సాంగ్ చూస్తే ఏడ్చేస్తారు
Share

Noel Sean : నోయెల్ సేన్ Noel Sean గురించి చెప్పాలంటే.. బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ముందు కూడా నోయెల్ అంటే సెలబ్రిటీనే. అప్పటికే రాప్స్ పాడటం.. సినిమాల్లో నటించడం.. స్టార్ హోదాను అనుభవించాడు కానీ.. బిగ్ బాస్ తర్వాత తన రేంజే మారిపోయింది. నోయెల్ సేన్ కు సపరేట్ ఫ్యాన్ సెట్ అప్ ఏర్పడింది. నోయెల్ వ్యక్తిత్వం తెలిసింది. బిగ్ బాస్ లో నోయెల్ అందరితో కలిసి మెలిసి ఉండటం.. ఆల్వేస్ హ్యాపీ అంటూ.. ఎప్పుడూ నవ్వుతూ ఉండి.. అందరినీ నవ్వించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అందుకే.. నోయెల్ అంటే బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరికీ ఇష్టం. ముఖ్యంగా లాస్య, హారిక, అభిజీత్. ఈ నలుగురు బెస్ట్ బడ్డీస్.

bigg-boss-noel-sean-marade-marade-video-song
bigg-boss-noel-sean-marade-marade-video-song

Noel Sean : మారదే మారదే ఈ ప్రేమ.. మనసెంత గాయపడినా? అంటున్న నోయెల్ సేన్

మారదే మారదే ఈ ప్రేమ.. మనసెంత గాయపడినా? తీరదే తీరదే ఈ ప్రేమ. తీరాలు దాటి వెళ్లినా? సముద్రపు లోతులన్ని కొలచి చూసినా.. ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా.. ఎక్కువే ఉంది ఈ ప్రేమ. నీ గుండెల్లో.. ఎక్కువే ఉంది ఈ ప్రేమ అంటూ తన కొత్త ఆల్బమ్ సాంగ్ తో అందరినీ ఏడిపించేస్తున్నాడు నోయెల్ సేన్.

తాజాగా మారదే మారదే ఆల్బమ్ సాంగ్ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశాడు నోయెల్. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. మొత్తానికి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ తో నోయెల్ తన అభిమానులను ఏడిపించేశాడు.

 


Share

Related posts

కిరణ్ కుమార్ రెడ్డి ని నిద్రలేపింది చంద్రబాబే నా ? 

sekhar

స్టీఫెన్‌ రవీంద్రకు కేంద్రం అనుమతి

somaraju sharma

Coconut Fiber: కొబ్బరి కాయలు, కొబ్బరి పీచుతో వ్యాపారం – లక్షల్లో ఆదాయం !

bharani jella