Bigg Boss 5 Telugu: ఆ జంటను చూసి తట్టుకోలేక పోయిన ప్రియాంక సింగ్..!!

Share

Bigg Boss 5 Telugu: ప్రియాంక సింగ్ సీజన్ ఫైవ్ లో అందరిని ఆకట్టుకునే గేమ్ ఆడుతూ వస్తుంది. మొదటి నుండి హౌస్ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రియాంక సింగ్… ఎక్కువగా కిచెన్ లో .. అందరికీ వంటలు వండుతూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ప్రియాంక సింగ్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు బయట గట్టి టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అక్టోబర్ మొదటి తారీకు జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ వ్యవహరించిన తీరు ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ గా మారింది. విషయంలోకి వెళితే ఇంటిలో ఉన్న సభ్యులందరి చేత బిగ్ బాస్.. రకరకాల గేమ్స్ ఆడించాడు. ఈ క్రమంలో షోలో.. నాలుగో వారం కెప్టెన్ అయిన శ్రీరామ్ నీ.. ఇంటర్వ్యూ చేయాలని ఆదేశించడంతో.. యాంకర్ సన్నీ ఉండగా .. ఇంటిలో సభ్యులు శ్రీ రామ్ నీ.. ప్రశ్నలు వేశారు.

ముందుగా కాజల్ మైక్ అందుకొని..సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్‌ టైమ్‌లో సిరి, డిన్నర్‌ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు. మరి టిఫిన్‌ టైమ్‌లో ఎవరూ లేరా? అని సన్నీ కౌంటరిచ్చాడు. మంచి అమ్మాయి కోసం వెయిటింగ్‌ అన్నావు, ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ క్వశ్చన్‌ వేయగా శ్రీరామ్‌.. సిరి కమిటెడ్‌ కాకపోయుంటే తప్పకుండా ఆమెకే ట్రై చేసేవాడిని అని చెప్పాడు. దీంతో రవి.. అన్న, నీ టేస్ట్‌ ఇంత బ్యాడ్‌ అనుకోలేదని సెటర్ వేయడం జరిగింది. ఆ తర్వాత గుండెల్లో ఎవరైనా అమ్మాయి ఉందా అనే ప్రశ్నకు… గుండెల నిండా ఏ అమ్మాయి అయినా నింపుకోవడానికి రెడీగా ఉన్నా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అంటూ ఓ ప్రియా ప్రియా… సాంగ్ పాడుతూ హల్లో తేలిపోయాడు.

Bigg Boss Telugu 5: Priyanka Disappointed When Sreeram Dance With Hamida - Sakshi

ప్రియాంక సింగ్ మొఖం మాడ్చుకోవడం..

ఆ తర్వాత ఇక్కడ ఉన్న వారిలో ఎవరితో డేట్ అనే ప్రశ్న రాగా… వెంటనే టక్కున హమీద పేరు చెబుతూ శ్రీరామ్ సాంగ్ పాడటం జరిగింది. అంత మాత్రమే కాక తన రెండు చేతులతో ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశాడు. ఈ క్రమంలో శ్రీరామ్ హమీదా బాగా క్లోజ్ అవ్వడాని.. చూసి ప్రియాంక సింగ్ తట్టుకోలేకపోయింది. ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఆ తర్వాత లోబో, సన్నీ హౌస్మేట్స్ ని ఏమి చేస్తూ పొట్టచెక్కలయ్యేలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే ప్రియాంక సింగ్ మొఖం మాడ్చుకోవడం పట్ల.. జనాలు సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఆమె ప్రేమించిన లవర్ గుర్తొచ్చి ఉంటది అందుకే ప్రియాంక సింగ్ ముఖం మాడిపోయింది అని.. కామెంట్ చేస్తున్నారు. మరోపక్క ప్రియాంక సింగ్.. కెప్టెన్ శ్రీరామ్ పై మనసు పారేసుకుంది అని అంటున్నారు.

శ్రీరామ్.. హమీద నీ.. గాల్లో ఎత్తుకొని…

మరోపక్క అంతకుముందే ప్రియాంక సింగ్ నల్లని చీర కట్టుకొని వయ్యారాలు పోతూ.. శ్రీ రామ్ వద్ద.. స్టెప్పులు వేయడం జరిగింది. ఖచ్చితంగా శ్రీరామ్ పై ఆమె మనస్సు పారేసుకుంది. అందువల్లే శ్రీరామ్.. హమీద నీ.. గాల్లో ఎత్తుకొని చేతులతో తిప్పటం.. తట్టుకోలేక పోయింది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో శ్రీరామ్ కూడా చాలా వరకు హౌస్ లో అందరి కంటే హమీద తో… బాగా కనెక్ట్ అయ్యాడు అని జనాలు చెప్పుకొస్తున్నారు. పడుకునే ముందు ఇద్దరూ కూడా సైగలు చేసుకుంటూ మాట్లాడుకోవడం తోపాటు గాల్లో ముద్దులు పంపుకుని… గుడ్ నైట్ చెప్పుకోవడం.. బట్టి చూస్తే ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే టాక్ కూడా బిగ్బాస్ వీక్షకులు.. అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా శ్రీరామ్ బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో.. ఓ లవర్ బాయ్ గా.. రెచ్చిపోతున్నాడు అని చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

Viral Video Effect: ఫలించని పిఓ ఎత్తుగడలు..! విచారణలో బట్టబయలైన రాసలీలల బండారం..! ఆ తరువాత ఏమైందంటే..?  

somaraju sharma

నేడు టీటీడీ బోర్డు సమావేశం: 93 అంశాల భారీ ఎజండాపై చర్చ

somaraju sharma

పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ఆ తోపు డైరెక్టర్ ని ఎందుకు పక్కన పెడుతున్నారు… ??

sekhar