Bigg boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది..బుల్లెట్లతో దుమ్ము దులిపేసిన నాగార్జున

Share

Bigg boss 5 : దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రొమో వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడూ అంటీ బిగ్ బాస్ లవర్స్ ఎదురు చూస్తున్న ఈ ప్రోమో ఇలా రిలీజ్ అయిందో లేదో అలా ట్రెండ్ అవుతోంది. టెలివిజన్‌ రంగంలోనే అత్యధికంగా వీక్షిస్తున్న బిగ్ రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ప్రముఖ ఛానల్ స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ తెలుగు ప్రేక్షకులను అలరించడంలో ముందు వరుసలో ఉంటుంది.

Bigg boss season 5 promo released
Bigg boss season 5 promo released

గత సంవత్సరం 15 వారాల పాటు జరిగిన సీజన్‌, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటి సభ్యులకు చేరువయింది. బిగ్‌బాస్‌ సీజన్‌ ముగిసిన వెంటనే తరువాత సీజన్‌ ఎప్పుడు ఆరంభమవుతుందోనంటూ ప్రతీ ఒక్కరూ అంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, చర్చలు సాగొస్తోన్న అభిమానులూ ఎంతో మంది ఉన్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ప్రొమోను తాజాగా విడుదల చేసింది స్టార్‌మా. షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోననే ఎదురుచూపులు… ఈసారి ఎవరు హౌస్‌లో ఉండబోతున్నారనే చర్చలు… చేస్తున్న కొత్త విశ్లేషకులలో ఆసక్తిని రేపుతూ కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ గా ఈ ప్రొమో రూపొందించారు.

Bigg boss 5 : గత సీజన్‌లతో పోలిస్తే మరింత ఆసక్తిగా ఉంటుందనే ప్రామిస్ కూడా చేస్తుంది.

మొట్టమొదటిసారిగా ఓ మ్యూజిక్‌ వీడియో రూపంలో విడుదల చేసిన ఈ ప్రొమోలో కింగ్ నాగార్జున, వినోదమనే బుల్లెట్‌లను నింపిన గన్‌తో ‘విసుగు’ను కిల్లర్‌గా కనిపించారు. మిస్టర్‌ విసుగు, బిగ్‌బాస్‌ నడుమ జరిగిన ముఖాముఖిలో ఈ విసుగును నాగార్జున తన వినోదపు బుల్లెట్‌తో చంపడంతో ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగిపోతారు. ఈసారి బిగ్‌బాస్‌ షో యాక్షన్‌, డ్రామా, రొమాన్స్‌, వినోదం, ఆహ్లాదం సమ్మేళనంగా ఉండటమే కాదు గత సీజన్‌లతో పోలిస్తే మరింత ఆసక్తిగా ఉంటుందనే ప్రామిస్ కూడా చేస్తుంది. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమోకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించాడు. సంగీతాన్ని యశ్వంత్‌ నాగ్‌ అందించాడు.రాహుల్‌ సిప్లిగంజ్‌ పాటను ఆలపించారు.


Share

Related posts

పరస్పర విరుద్ధమైన నివేదికలు: ‘ఏలూరు జబ్బు’కు కారణం కనుక్కోలేకున్న నిపుణులు!

Yandamuri

మెగాస్టార్ పెద్ద కూతురు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Teja

బూతులు చూసేది ఆ ఒక్క‌డే అనుకుంటున్నారా … ఇదిగో వీళ్లు కూడా…

sridhar