Bigg Boss 5 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్బాస్ షో ఇప్పటికే సెకండ్ వీక్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నిన్న ముగియడంతో.. హౌస్ లో ఇంటి సభ్యుల చేత బిగ్ బాస్ ఓ ఆట ఆడిస్తున్న సంగతి తెలిసిందే. రెండు టీములు గా ఉన్న తరుణంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడా కూడా.. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కూల లో తగ్గటం లేదు. ఎవరికి వారు బూతులు మాట్లాడటం మాత్రమే కాక ఒకరిపై మరొకరు రెడ్ మీ మాదిరిగా కొట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే గతంలో మాదిరిగానే ఈ సీజన్ ఫైవ్ కి కూడా లీకుల బెడద తప్పటం లేదు. ఇటువంటి తరుణంలో.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ కెప్టెన్ గా కండలవీరుడు విశ్వ.. సెలక్ట్ అయినట్లు లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. మరి కొద్ది నిమిషాలలో ప్రారంభం కాబోయే ఈ షో కి సంబంధించి వార్త సోషల్ మీడియాలో ముందే రావడంతో.. వైరల్ అవుతుంది. గద్ద టీం గెలిచినట్లు విశ్వ కెప్టెన్ ఎన్నికైనట్లు మొదటి వారంలో రేషన్ మేనేజర్ గా కొనసాగిన విశ్వ 2 వారంలో కెప్టెన్ అయినట్లు.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
మరోపక్క ప్రతి సీజన్లో హౌస్లో.. మంచి ఫిట్నెస్ ఉన్న కంటెస్టెంట్ లు రీతిగానే రాణిస్తున్నారని అదే కోణం సీజన్ ఫైవ్ లో కూడా రిపీట్ అయిందని బిగ్బాస్ ఆడియన్స్ అంటున్నారు. గతంలో అలీ రెజా, అఖిల్ సోహెల్ అంతకుముందు కౌశిక్.. లాంటి ఫిట్ గా ఉన్న వాళ్లు రాణించడం జరిగింది ఇప్పుడు సీజన్ ఫైవ్ లో కూడా విశ్వ అదే రీతిలో రాణించాడని.. హౌస్ లో సెంటిమెంట్ మళ్ళి రిపీట్ అయిందని.. అంటున్నారు.