Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ .. సెన్సేషనల్ రికార్డ్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ఇప్పటికే 10 ఎపిసోడ్ లు.. పూర్తి కావటం మాత్రమే కాక ఒకళ్ళు ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. దాదాపు 19 మంది ఇంటిలోకి అడుగు పెట్టగానే 18 మంది ఉన్నారు. ఈవారం ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. దీంతో ఎల్లుండా మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ క్రమంలో డబల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అని.. అంటున్నారు. సీజన్ ఫైవ్ లో.. టాప్ మోస్ట్ సెలబ్రిటీలు పెద్దగా లేకపోయినా యాంకర్లు ఎక్కువగా ఉండటంతో పాటు సీనియర్ సీరియల్ యాక్టర్ లు .. సోషల్ మీడియా స్టార్ లో ఉండటంతో.. షోకి పర్వాలేదు అన్నరీతిలో.. ఆదరణ వస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ షో టిఆర్పి రేటింగ్ విషయంలో రికార్డు సృష్టించిన ట్లు..హోస్ట్ నాగార్జున ప్రకటించారు. విషయంలోకి వెళితే..ఈసారి లాంచ్‌ ఎపిసోడ్‌కు18 టీఆర్పీ వచ్చింది! అని పేర్కొన్నారు. సీజన్ వన్ కి వచ్చేసరికి హోస్ట్ ఎన్టీఆర్. సీజన్ రెండోదానికి వచ్చేసరికి.. నాని. మూడో సీజన్ నుండి నాగార్జున హోస్ట్ గా.. రాణిస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున హోస్ట్ గా ప్రారంభ ఎపిసోడ్ మొదలుపెట్టిన సమయంలో…మూడవ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ రేటింగ్‌ దక్కింది.

Bigg Boss Telugu 5 premiere episode LIVE UPDATES: From Ravi Kiran, Swetaa to Lahari Shari, here's complete list of contestants | Entertainment News,The Indian Express

ఇది బిగ్‌బాస్‌ షోకు మరింత బూస్ట్‌నిచ్చినట్లైంది. తర్వాత నాగ్‌ మరోసారి బిగ్‌బాస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాలుగో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. దీంతో తన రికార్డు తనే బద్ధలు కొట్టాడు నాగ్‌. ఐదో సీజన్‌తో ఆ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా గత సీజన్‌ కంటే ఈసారి లాంచ్‌ ఎపిసోడ్‌కు కాస్త తక్కువ రేటింగ్‌ నమోదైంది. 18 టీఆర్పీ.. నమోదైనట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో కంటే అనగా నాలుగో సీజన్ కంటే తక్కువ రేటింగ్ పాయింట్ ఐదు శాతం తగ్గటం జరిగింది. ఏదిఏమైనా బిగ్ బాస్ రియాల్టీ షో లో హోస్ట్ గా.. నాగార్జున సాంగ్ క్రియేట్ చేసిన రికార్డులను తానే పగలగొట్టడం.. విశేషమని ఆడియన్స్ అంటున్నారు. యాంకరింగ్ లో నాగార్జున… ఒక పెద్ద తరహాలో ఇంటిలో ఉన్న సభ్యులకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నరీతిలో క్లాసులు పీకడం తో పాటు.. మంచి చేసిన టైం లో శభాష్ అని రైతులు అందరి చేత చప్పట్లు కొట్టించి .. అద్భుతంగా హోస్ట్ గా.. రాణిస్తున్నారని నాగార్జున తాజా రికార్డు న్యూస్ పై సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.

ఏ మాత్రం తరగని అందంతో పాటు సరికొత్త ఫిట్నెస్ అంత వయసులో కూడా.. నాగార్జున మెయింటైన్ చేయటం అది ఓ రియాలిటీ షోలో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కించుకోవడం.. మామూలు విషయం కాదని.. ఆయన హోస్టింగ్ పై మరి కొంతమంది ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ కి.. కొద్దిగా ఆదరణ దక్కటం ఎక్కడంటే.. షో కి సంబంధించి..లీకులు వలన ముందే.. ఇంటిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు చెప్తే నవ్వుతున్నారు అనే వార్తలు తెలిసిపోవడంతో .. షో పై కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిందని.. అందువల్లే గత సీజన్ల కంటే కొద్దిగా టిఆర్పి రేటింగ్ తక్కువ నమోదయిందని.. బిగ్బాస్ ఆడియన్స్ అంటున్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం షో పై మరింత ఇంట్రెస్ట్ కలగాలంటే వైల్డ్కార్డ్ ఎంట్రీ సభ్యులు మరింత పాపులర్ అయి ఉండే వాళ్లను పంపిస్తే షో ఇంకా రక్తి కడుతుందని.. ఇంటిలో ఉన్న ప్రస్తుత వాతావరణం చూస్తే కొద్దిగా స్క్రిప్ట్ పరంగా వెళ్తున్నట్టు.. ఉందని, ఫేవరిటాజం కనిపిస్తుందని పేర్కొంటున్నారు.


Share

Related posts

Pregnancy: గర్భం తో ఉన్న నవమాసాలు.. మీద నవగ్రహాల ప్రభావం ఉంటుందా?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి??

siddhu

బియ్యం నీటితో నమ్మలేని ఫలితాలు

Kumar

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు…! రూ.16 కోట్లు స్వాధీనం..!!

Special Bureau