బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. ఎన్నో భాషల్లో బిగ్ బాస్ షో ను స్టార్ట్ చేశారంటేనే ఆ షో కి ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అందులోనూ హిందీ బిగ్ బాస్ షో గురించి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. నిర్విఘ్నంగా ఏకంగా 14 సీసన్ లను పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్.
ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ 14 వ సీజన్ నడుస్తోంది. అయితే తాజాగా హిందీ బిగ్బాస్ సీజన్ 14 లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లుగా ఈ షోకి మేనేజర్ గా ఉంటున్న పిస్తా ధాకడ్ (24) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ ను షూటింగ్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు పిస్తా ధాకడ్. సాయంత్రం తన అసిస్టెంట్ స్కూటీపై ఆమె ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారి స్కూటీ స్కిడ్ అయ్యి ఇద్దరూ కిందపడిపోయారు.
అయితే అదృష్టవశాత్తు ఆమె చిన్న చిన్న గాయాలు తగిలాయి. అక్కడ నుంచి తిరిగి పైకి లేస్తున్న సమయంలో ఒక వ్యానిటీ వ్యాన్ రూపంలో ఆమెను మృత్యువు కబలించింది. వ్యానిటీ వ్యాన్ పిస్తా ధాకడ్ను వెనుక నుంచి వచ్చి గట్టిగా ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెతో ఉన్న అసిస్టెంట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె అంతటి టాప్ రియాలిటీ షో కి మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఆమె మృతితో ఒక్కసారిగా హిందీ బిగ్ బాస్ లో తీవ్ర విషాదం నెలకొన్నది. పిస్తా ధాకడ్ మరణంపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.