ట్రెండింగ్ న్యూస్

Bigg boss Sohel : సుడిగాలి సుధీర్ కు తాతలా ఉన్నాడే.. అమ్మో.. సోహెల్ కూడా చిన్నోడు కాదు?

bigg boss sohel and mehaboob funny video
Share

Bigg boss Sohel : బిగ్ బాస్ సోహెల్ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. బిగ్ బాస్ కంటే ముందు ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ. బిగ్ బాస్ కంటే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్నా.. సీరియళ్లలో నటించినా.. సోహెల్ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియలేదు కానీ… ఎప్పుడైతే సోహెల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడో.. అంతే ఇక.. సోహెల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సోహెల్ ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రస్తుతం తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తనకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. పలు ప్రోగ్రామ్స్ లోనూ ఆఫర్లు వస్తున్నాయి. దానికి కారణం బిగ్ బాసే.

bigg boss sohel and mehaboob funny video
bigg boss sohel and mehaboob funny video

ఇక.. బిగ్ బాస్ హౌస్ లో సోహెల్ కు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మెహబూబ్, అఖిల్. అఖిల్ కన్నా కూడా మెహబూబ్ అంటే సోహెల్ కు ప్రాణం. సోహెల్.. మెహబూబ్ ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన సందడి మామూల్ది కాదు.

Bigg boss Sohel : సుడిగాలి సుధీర్ ను అనుకరించిన బిగ్ బాస్ సోహెల్

అయితే.. ఢీ షోలో ఇటీవల వచ్చిన ఓ ప్రోమోలోని డైలాగ్ కు డబ్ స్మాష్ చేశారు సోహెల్, మెహబూబ్. ఢీ షోలో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ మధ్య ఓ చిన్న సంభాషణ జరుగుతుంది.నాకు దివ్య దృష్టి ఉంది తెలుసా అని సుధీర్ అంటాడు. దీంతో.. నీకు దివ్య పైన దృష్టి ఉందని తెలుసు కానీ.. దివ్య దృష్టి ఉందని తెలియదు.. అంటూ యాంకర్ ప్రదీప్ అనడంతో.. అందరూ తేడాగా మాట్లాడుతున్నారేంటయ్యా బాబు. ఇందాక ఓ ప్రొడ్యూసర్ కాల్ చేసి సినిమా క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పాడు. ఎందుకు అని అడగగా.. హీరోయిన్ కు నాకు ఒకే రూమ్ ఇవ్వండి..

ఆడియో ఫంక్షన్ అదిరిపోవాలి అన్నా.. అని సుధీర్ అనేసరికి.. నీకు, హీరోయిన్ కు ఒకే రూమ్ ఇస్తే ఆడియో ఫంక్షన్ కాదు జరిగేది.. అంటూ యాంకర్ ప్రదీప్ అంటాడు. ఇది.. తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రావడంతో.. ఆ డైలాగ్స్ ను తీసుకొని.. సుధీర్ లా సోహెల్ మారి.. యాంకర్ ప్రదీప్ లా మెహబూబ్ మారి.. ఆ ఫన్నీ డైలాగ్స్ తో డబ్ ష్మాష్ చేసి.. ఆ వీడియోను మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్ లో పెడతాడు. అది అసలు విషయం.. ఏది ఏమైనా.. సుధీర్ లో ఉన్న క్వాలిటీస్ అన్నీ సోహెల్ లోనూ ఉన్నాయి. సోహెల్ కూడా ఏం తక్కువ తినలేదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=khm0fklG-II


Share

Related posts

Raghu Ramakrishnam Raju: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వైస్సార్సీపీ ఎంపీ లు దూకుడు…!!..!!

sekhar

Yuvaraj singh: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ వెనక ఇంతా కథ ఉందా …?

Ram

ఎలక్షన్ గెలిచిన తరవాత జగన్ భయపడ్డం ఇదే మొట్టమొదటిసారి .. ఇది సెన్సేషనే !

CMR