ట్రెండింగ్ న్యూస్

Bigg boss Sohel : బిగ్ బాస్ పైసలతో కొత్త కారు కొన్న సోహెల్.. కథ వేరే ఉంటదట ఇక?

Bigg boss Sohel బిగ్ బాస్ పైసలతో కొత్త కారు కొన్న సోహెల్ కథ వేరే ఉంటదట ఇక
Share

Bigg boss Sohel : బిగ్ బాస్ సోహెల్ Bigg boss Sohel  తెలుసు కదా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ టు ఫన్. సోహెల్ అంటేనే కథ వేరే ఉంటది. బిగ్ బాస్ సోహెల్ కు ప్రస్తుతం ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే.. బిగ్ బాస్ కంటే ముందు.. దాదాపు 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. సోహెల్ అంతగా గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే సోహెల్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడో.. సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది.

Bigg boss sohel buys new car
Bigg boss sohel buys new car

కథ వేరే ఉంటది.. అంటూ తన ఊతపదంతో బిగ్ బాస్ హౌస్ లో సోహెల్ ఫుల్ టు హల్ చల్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చినా.. తర్వాత టాప్ 5 లోకి వెళ్లి.. టాప్ 3గా 25 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని మరీ బయటికి వచ్చాడు సోహెల్.

సోహెల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే.. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న సోహెల్.. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బుతో కొత్త కారు కొన్నాడు. కొత్త ఎంజీ కారు కొన్న సోహెల్.. తాను కారు కొన్నానంటూ తన అభిమానులకు యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించాడు.

Bigg boss Sohel : ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లే.. ఇప్పుడే కొత్త కారు కొన్నా?

నా జీవితంలో నేను ఎప్పుడూ కొత్త కారు కొనలేదు. అన్నీ సెకండ్ హ్యాండ్ కార్లే. కానీ.. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక కొత్త కారు కొంటున్నా. మొదటిసారి నాన్న, అమ్మను ఎక్కించుకొని కరీంనగర్ వెళ్లి వస్తా.. సోహెల్ అన్నాడు. సోహెల్ తో పాటు.. షోరూంకు సోహెల్ నాన్న, బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ కూడా ఉన్నాడు.

దానికి సంబంధించిన వీడియోను తాజాగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సోహెల్ కొత్తకారును చూసేయండి.

 


Share

Related posts

విద్యా సంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించిన తెలంగాణ సర్కార్

somaraju sharma

Cholesterol: ఇందులో ఉండే ఫైబర్ ఎందులోనూ దొరకదు.. కొవ్వు కరిగించడంతోపాటు ఈ సమస్యలు దూరం..!!

bharani jella

ముందస్తు బెయిల్‌పై తీర్పు రేపటికి వాయిదా

somaraju sharma