Bigg boss Sohel : బిగ్ బాస్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కంటే ముందు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం సోహెల్ చేసిన హార్డ్ వర్క్ మామూల్ది కాదు. కానీ.. అనుకున్నంత పాపులారిటీ ఆయనకు రాలేదు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ లో సోహెల్ కు అవకాశం వచ్చిందో అప్పుడే సోహెల్ గురించి అందరికీ తెలిసింది. సోహెల్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

బిగ్ బాస్ సోహెల్ ఏంటో… ఆయన ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే విలువ ఏంటో అందరికీ తెలుసు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలామంది ఫేవరేట్ కంటెస్టెంట్ గా నిలిచాడు సోహెల్. చాలామంది యువతులు అయితే సోహెల్ కు పడిపోయారు కూడా. అంత క్రేజ్ వచ్చింది సోహెల్ కు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన అభిజీత్ కు కూడా అంత పేరు రాలేదు.. అన్ని ఆఫర్స్ రాలేదు కానీ… సోహెల్ కు చాలా సినిమాల ఆఫర్స్ వచ్చాయి.. చాలా షోలలోనూ ఆఫర్స్ వచ్చాయి. అయితే… సామాజిక కార్యక్రమాల్లోనూ సోహెల్ ఎప్పుడూ ముందుంటాడు. చాలాసార్లు సాయం అవసరమైనవాళ్లకు హెల్ప్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు సోహెల్.
Bigg boss Sohel : దివ్యాంగురాలికి మాట సాయం చేసిన సోహెల్
సోహెల్ దగ్గరికి దివ్యాంగురాలైన ఓ యువతి వచ్చింది. తన పేరు సౌమ్య. తను రెడీ మెడ్ జ్యూవలరీని ఆన్ లైన్ లో అమ్ముతోంది. తనకు కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ వ్యాధి వల్ల కాళ్లు చేతులు పడిపోయాయి. ఒక్క చేయి మాత్రం పనిచేస్తుంది. తన కోసం చాలా ఖర్చు పెట్టారు కానీ.. తన ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఇప్పటికీ.. మెడిసిన్ కోసం నెలకు 50 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. దీంతో తన సొంత కాళ్ల మీద నిలబడాలని… ఈ ఆన్ లైన్ జ్యూయలరీ బిజినెస్ ను సౌమ్య ప్రారంభించింది.
తన ఆన్ లైన్ బిజినెస్ గురించి సోహెల్ ఓ పది మందికి చెబితే.. చాలామందికి తెలిసి ఆర్డర్లు పెరుగుతాయని… సోహెల్ వద్దకు వెళ్లి.. సౌమ్య రిక్వెస్ట్ చేసింది.
దీంతో సోహెల్ వెంటనే తనకు సపోర్ట్ చేయాలని… తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ను ఫాలో అయి.. నచ్చిన జ్యూయెలరీని ఆర్డర్ చేసుకోవాలని తన అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు. తను కూడా తన తల్లి కోసం ఓ మూడు జ్యూయెలరీ సెట్ ను ఆర్డర్ పెట్టాడు సోహెల్.
ఎంతైనా సోహెల్ ది మంచి మనసు. అందుకే నువ్వంటే అందరికీ ఇష్టం సోహెల్. తాజాగా సౌమ్యతో మాట్లాడిన వీడియోను సోహెల్ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.