Bigg boss Sujatha : బిగ్ బాస్ సుజాత Bigg boss Sujatha కన్నా.. జోర్దార్ సుజాత అంటే అందరూ తొందరగా గుర్తుపట్టేస్తారు. కానీ.. బిగ్ బాస్ లో అవకాశం వచ్చాక.. తను జోర్దార్ సుజాత కన్నా బిగ్ బాస్ సుజాతగా ప్రఖ్యాతి పొందింది. బిగ్ బాస్ లో తనకు అవకాశం వచ్చాక.. సుజాత లైఫ్ స్టయిలే మారిపోయింది. తను కూడా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం సుజాతకు ఫుల్ టు ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాల్లో, టీవీ షోలలో, ఇతర ప్రోగ్రామ్స్ లో, వెబ్ సిరీస్ లలోనూ తనకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి.

బిగ్ బాస్ అంటే అంతే మరి.. ఎవ్వరినైనా సెలబ్రిటీని చేసేస్తుంది బిగ్ బాస్. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జోర్దార్ సుజాత.. సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్ పెట్టింది. అందులో తన పర్సనల్ వీడియోలు, ఇతర వీడియోలు.. అన్నీ పెట్టేస్తుంది.
Bigg boss Sujatha : బీబీఉత్సవం ఆఫ్ స్క్రీన్ లో ఏం జరిగిందో చూడండి?
ఇటీవల స్టార్ మాలో బీబీఉత్సవం అనే షోను నిర్వహించారు కదా. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరూ కలిసి సందడి చేశారు ఈ ప్రోగ్రామ్ లో. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు మాత్రం ఈ ప్రోగ్రామ్ లో ఫుల్ టు ఎంజాయ్ చేశారు. అయితే.. జోర్దార్ సుజాత.. బీబీఉత్సవం షూట్ కోసం ఎప్పుడు వెళ్లింది. అక్కడ ఏం చేసింది. ఆఫ్ స్క్రీన్ లో వీళ్లంతా ఏం చేశారు.. అనే వాటిని క్యాప్చర్ చేసింది సుజాత. వాటన్నింటినీ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా జోర్దార్ సుజాత బీబీఉత్సవం గురించి షేర్ చేసిన వీడియోను చూసేయండి.