Bigg boss Sujatha : బిగ్ బాస్ సుజాత Bigg boss Sujatha గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసవరమే లేదు. తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. అంతకుముందు జోర్దార్ వార్తలు చదివే రీడర్ గా ఉన్న సుజాత.. బిగ్ బాస్ హౌస్ లోకి తనకు అవకాశం రావడంతో తన రేంజే మారిపోయింది. అప్పుడు అందరూ తనను జోర్దార్ సుజాత అనేవాళ్లు. ఇప్పుడు తనను అందరూ బిగ్ బాస్ సుజాత అంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక సుజాత చాలా ఆఫర్లు వచ్చాయి. సినిమా ఆఫర్లతో పాటు పలు షోల ఆఫర్లు కూడా వచ్చాయి. అలాగే.. తను ఓ యూట్యూబ్ చానెల్ కూడా పెట్టింది. దాని పేరు సూపర్ సుజాత. తన యూట్యూబ్ చానెల్ లో పలు వీడియోలను చేస్తూ తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది సుజాత.
Bigg boss Sujatha : కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ సెట్ లో బిగ్ బాస్ సుజాత
అయితే.. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ సెట్ లో బిగ్ బాస్ సుజాత మెరిసింది. ఈమధ్య సుజాత కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో ముక్కు అవినాష్ స్కిట్ లో నటిస్తోంది. అందుకే.. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ సెట్ కు వెళ్లి… అక్కడ షూటింగ్ కోసం ఎలా రెడీ అవుతారు, స్కిట్ ను ఎలా ప్రాక్టీస్ చేస్తారు, మేకప్ ఎలా వేసుకుంటారు? ఫుడ్.. ఇలా అన్ని రకాల విషయాల గురించి సుజాత ఓ వీడియో తీసి తన అభిమానులతో పంచుకుంది.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.