Bigg boss Sujatha : బిగ్ బాస్ సుజాత తెలుసు కదా. బిగ్ బాస్ సీజన్ 4 లోకి రావడానికంటే ముందు.. సుజాత హెచ్ఎంటీవీలో జోర్దార్ వార్తల్లో యాంకర్ గా పనిచేసేది. తన తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకున్న సుజాతకు తన తెలంగాణ యాసే ఎన్నో ఆఫర్లను తెచ్చిపెట్టింది. తనకు బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో తన రేంజే మారిపోయింది. తనకు ఇప్పుడు బోలెడు ఆఫర్లు. పలు టీవీ షోలతో పాటు.. సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇతర ప్రోగ్రామ్స్ లోనూ తనకు అవకాశాలు వస్తున్నాయి.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తనకు బాగా ఆఫర్లు రావడంతో తన కల అయిన కొత్త కారును కూడా కొనేసింది సుజాత. ఇటీవలే తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. కొత్త కారులో తన పేరెంట్స్ తో కలిసి తన సొంత ఊరుకు చెక్కేసింది సుజాత.
Bigg boss Sujatha : తన ఊరును అభిమానులకు చూపించిన సుజాత
ఇక… తన సొంతూరు అయిన వరంగల్ జిల్లాలోని ఉప్పరపల్లికి వెళ్లిన సుజాత… తన పుట్టిన ఊరికి తన తల్లిదండ్రులతో కారులో వెళ్లి తన ఊరు వీడియో తీసి యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. తను చదువుకున్న బడికి వెళ్లి…. అక్కడ తన చిన్ననాటి మెమోరీస్ ను గుర్తు చేసుకుంది. ఊరులో ఉన్న బొడ్రాయి, చెరువు, ఇంకా ఊరు రోడ్లు అన్నింటినీ చూపించింది సుజాత.
ఇంకెందుకు ఆలస్యం… సుజాత పుట్టిన ఊరును మీరు కూడా చూసేయండి మరి.