Bigg Boss 5 Telugu: హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఈ వారం బిగ్ సర్ప్రైజ్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు ఇంకా 30 రోజుల కంటే తక్కువగానే గేమ్ బ్యాలెన్స్ ఉంది. 19 మంది కంటెస్టెంట్ లో ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. పది మంది ఎలిమినేట్ కాక జేస్సీ(Jessy) అనారోగ్యం కారణంగా… హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లకు రోజురోజుకి టెన్షన్ పెరిగిపోయే రీతిలో పరిస్థితులు మారిపోతున్నాయి. హౌస్ లో ఉన్న వారికి అదే రీతిలో చూస్తున్న ఆడియన్స్ కి కూడా ఇదే పరిస్థితి. ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..?, ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు..? అనేది..ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఎక్కువగా జరుగుతున్న డిస్కషన్స్.

Bigg Boss 5 got heat with nominations all are in except one

ఇటువంటి తరుణంలో ఈ వారంలో అవసరం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్ లనీ రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్లడానికి…బిగ్ బాస్ బిగ్ సర్ ప్రైజ్ ఈ వారం రెడీ చేసినట్లు టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే ఈవారం హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులనీ.. హౌస్ లోకి పంపించడానికి బిగ్ బాస్ (Bigg Boss)ఏర్పాటు చేయడం జరిగిందట. ఈ క్రమంలో ఇప్పటికే వారిని ఐసోలేషన్ లో పెట్టినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే షణ్ముక్(Shanmuk) నీ ఇంటి సభ్యులు కాకుండా దీప్తి సునయన.. కలవనున్నట్లు సమాచారం. అదేవిధంగా యాంకర్ రవి(Ravi) ని… భార్యతో పాటు బిడ్డ నిత్య కూడా ఈవారం కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఎఫెక్ట్.. రెచ్చిపోయిన శ్రీరామ్ చంద్ర.. కౌంటర్ ఇచ్చిన సన్నీ..

వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో

ముఖ్యంగా పింకీ(Pinky)ని ట్రాంజెండర్ గా నిజం తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి తల్లిదండ్రులు.. ఈవారం కలవనున్నారట. ఈ రీతిగా హౌస్ లో టెన్షన్ లో ఉన్న ఇంటి సభ్యులను రిలాక్స్ మోడ్ లోకి బిగ్ బాస్(Bigg Boss) తీసుకెళ్లనునట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. పింకీ, మానస్, కాజల్, రవి, శ్రీరామ్, షణ్ముక్, సిరి, సన్నీ. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు.. అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. చాలా వరకు ఎప్పటిలాగానే.. మళ్లీ మగవారే టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

బీజేపీ వెనుక “మీడియా” బుర్ర..! సైలెంట్ గా చక్కబెడుతున్న టీవీ 9 రవిప్రకాష్..!?

Srinivas Manem

కీలక నిర్ణయం తీసుకున్నఏపీ ప్రభుత్వం : ఏస్మా పరిధిలోకి ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సర్విస్లు

Siva Prasad

బీజేపీ విషయంలో డైలమాలో పవన్..??

sekhar