దివి మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్. మొన్నటి వరకు ఏం చేసిన పెద్దగా పట్టించుకోని మీడియా.. ఇప్పుడు ఆమె ఏం చేసినా కూడా కవరేజ్ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌజ్ లోకి పోకముందు పలు సినిమాల్లో మంచి రోల్స్ చేసింది. కానీ పాపులర్ కాలేదు.
ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ అయ్యిందో ఆ రోజు నుంచి అందరి కళ్లు ఆమె మీద పడ్డాయి. దాంతో ఫుల్ పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దివి మహర్షి లాంటి పెద్ద సినిమాలతో పాటు పలు సినిమాల్లో యాక్టింగ్ చేసింది. మోడల్‌గా, యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్న ఈ చిన్నదానికి బిగ్ బాస్ మంచి వేదికగా అయ్యిందని చెప్పుకోవచ్చు.
ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చి రాగానే పలు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటునే వరుస ఫొటో షూట్లల్లో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆ షూట్లల్లో భాగంగా తీసిన ఒక ఫొటో పలువురి ఆకట్టుకుంటుంది. ఒక పంట పొలంలో విత్తనాలు వేస్తున్నట్లు ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దివి సూపర్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌజ్ లోకి పోయిన కొద్ది రోజులకే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన ముద్దు ముద్దు మాటలతో హోస్ట్ నాగార్జునాను కూడా మెప్పించింది. అలాగే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న తోటి వారితో కూడా ఎంతో చనువుగా ఉంటూ అందరికి దగ్గరైందని చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌజ్ ఆమెకు చాలా యూజ్ అయ్యిందని చెప్పాలి.