తెలుగు ప్రేక్షకులందరని ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ రియాలిటి షో బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్టార్ మా అధికారకంగా ప్రకటించి రీసెంట్ గా సీజన్ 4 ప్రోమో ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున త్రిపాత్రాభినయంతో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సీజన్ 4 ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీని పెంచేసింది.
బిగ్ బాస్ అంటేనే ఫుల్ ఫన్.. టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్, కావలసినన్ని కాంట్రవర్సీలు. షో మొదలైందంటే ప్రతీ ఒక్కరు హాట్ హాట్ గా చర్చించుకుంటుంటారు. ఇక ఇప్పటికే సక్సస్ ఫుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్ కి రెడీ అవుతోంది. సీజన్ 4 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ అని ఇప్పటికే అందరికీ తెలిసింది. అయితే ఎలాంటి గెటప్ లో హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ క్రమంలో కంటెస్టంట్ ల గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఆగస్టు చివరి వారం నుంచి సీజన్ 4 మొదలవుతుందని తెలుస్తోంది. ఇక కింగ్ నాగార్జున ప్రత్యేకంగా ఒక ప్రముఖ యాంకర్ ని రిఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో క్లారిటీ రాకముందే మరో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీజన్ 4 లో ప్రముఖ యాంకర్ కం నటి అనసూయ పాల్గొనబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే అనసూయ ఒకవైపు బుల్లితెర మీద ఒకవైపు సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతూ విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. దాంతో అనసూయ గనక బిగ్ బాస్ లో పాల్గొంటే షోకి క్రేజ్ పీక్స్ లో ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారట. కాని కంటెస్టెంట్ లు మాత్రం అనసూయ వస్తే ఈ సీజన్ లో మేము పాల్గొనమని అంటున్నట్టు తెలుస్తుంది. కారణం అనసూయ కి ఉన్న పాపులారిటీ. మరి ఇది ఎంతవరకు నిజమో త్వరలో క్లారిటీ రానుంది.