Bigg Boss Telugu 5: బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే తొలి కంటెస్టెంట్ అతన్నే అంటున్న జనాలు..??

Share

Bigg Boss Telugu 5: వీకెండ్ ఎపిసోడ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. దీంతో హౌస్ లో మొదటి ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారు అనేది ఇప్పుడు ప్రేక్షకులలో సస్పెన్స్ గా నెలకొంది. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో మోడల్ జెస్సీ ఆడుతున్న ఆట తీరు చూస్తే అభద్రతా భావంతో ఉన్నట్లు.. కచ్చితంగా ఎలిమినేషన్ అయ్యేటట్లు ఉన్నట్లు అతనికి ఏముందని బిగ్ బాస్ వీక్షకులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మోడలింగ్ రంగంలో అనేక అవార్డులు అందుకున్న జెసి ఇండస్ట్రీలో ఎంత మంచి వాడవురా అనే సినిమాలో నటించడం జరిగింది. పెద్దగా అంచనాలు లేకుండా హౌస్ లో అడుగు పెట్టిన జేసీ.. మొదటినుండి ఇంటిలో అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే మరోపక్క ఆవేశపూరితంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు అదే ఫైర్ లో రాణిస్తున్నాడు.

Bigg boss tidbits: Will Jessy be the first one to be eliminated this season?

దీంతో ఈ వారం అతడు నామినేషన్ అవుతాడా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇటువంటి తరుణంలో జెస్సి తల్లి.. సునీత ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తన కొడుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ జెసి గురించి మాట్లాడుతూ.. చిన్ననాటి నుండి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు అని, జెర్సీ స్కూల్ టైం లో తన ఫాదర్ చనిపోవడం మాత్రమే కాక పక్షవాతంతో అనేక ఇబ్బందులు.. అతడి కళ్ల ముందు ఎదుర్కోవడంతో చాలా మానసిక క్షోభ అనుభవించడానికి పేర్కొన్నారు. దీంతో మొదటి వారమే నామినేషన్ లోకి రావడంతో అతడు మెంటల్గా మరింతగా ప్రస్తుతం డిస్టర్బ్ అయ్యాడని.. పైగా తన కొడుకుకి బయట మంచి ఫాలోయింగ్ కూడా పెద్దగా లేదని, బిగ్బాస్ నాని కి లైఫ్ ఇస్తుందని ఎన్నో అంచనాలు పెట్టుకొని అడుగుపెట్టాడు. కానీ మొదటి వారంలోనే ఎలిమినేషన్ లోకి వెళ్లడంతో.. కన్ఫ్యూజన్లో జెస్సి గేమ్ ఉందని.. ఈ సమయంలో ప్రేక్షకుల సపోర్ట్ కావాలని సునీత కోరారు. ఇక ఇదే తరుణంలో షణ్ముఖ్ జస్వంత్ కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటాడు అని కోరుకుంటున్నట్లు సునీత ఎమోషనల్ గా తెలియజేశారు.

జెస్సీ  అతి ఆట…

మరోపక్క జెస్సీ గురించి బయట నెటిజన్లు.. అనవసరమైన విషయాలు కలగజేసుకుని మరి.. ఇతర వస్తువులను.. దాచిపెట్టడం ఇదంతా అతడు చేసిన అతి ఆట కి నిదర్శనం అని మండిపడ్డారు. అతనితో పాటు చేసిన సిరి ఇప్పుడు కెప్టెన్ గా హౌస్ లో చలామణి అవుతుంటే అతడికి గట్టిగానే పిడి పడిందని.. ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉన్నాయని.. కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ టాస్క్ లు.. ఇవ్వకుండానే హౌస్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చివరాకరికి.. హోల్ పడేది ఈ విధంగానే ఉంటుందని.. మరికొంత మంది నెటిజన్లు మరింత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు జెసి వ్యవహారంపై. ఏది ఏమైనా ఈ సీజన్ ఫైవ్ లో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఆరుగురు సభ్యులు ఖచ్చితంగా వీక్ క్యాండెట్.. జెస్సీ యే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో… ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పరంగా చూసుకుంటే చాలా మంది టాప్ మోస్ట్ సెలబ్రిటీలకు భారీగా ఓట్లు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే రీతిలో టిఆర్పి రేటింగ్ లలో కూడా ఈ సీజన్ ఫైవ్ కి బాగా ఆదరణ దక్కుతున్నట్లు కూడా టాక్.


Share

Related posts

సూర్యాస్తమయం తర్వాత అమ్మాయిలు ఇంటికి వస్తే వాళ్లు ఏం చేస్తారో తెలుసా?

Teja

 అలీ వేసెను గోళీ..! ఇది రాజకీయ పాళీ.., జగన్ కేళి..!!

Special Bureau

Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి !!(పార్ట్1)

Kumar