బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్.. హౌస్ నుండి బయటకు వచ్చాక మొదట కుటుంబ సభ్యులతో గడిపి తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గత మూడు సీజన్ల కంటే నాలుగో సీజన్ లో చాలామంది సెలబ్రిటీల మద్దతు కూడగట్టుకుంది అభిజిత్ కావటం విశేషం.
హౌస్ లో ఒక్కసారి కెప్టెన్ అవ్వకపోయినా 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేషన్ అయినా గాని ఎక్కడా కాన్ఫిడెంట్ కోల్పోకుండా అభిజిత్ ఆడిన గేమ్ అతనికి టైటిల్ వచ్చేలా చేసింది. దీంతో అభి టైటిల్ గెలవడంతో బయట అతని పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే పలు సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న సమయంలో తన పట్ల చూపిన ప్రేమకు చాలామంది సెలబ్రిటీలకు ప్రత్యేకంగా వెళ్లి కలిసి మరి కృతజ్ఞతలు తెలుపుతున్నా అభిజిత్..క్రిస్మస్ రోజున సాంటాక్లాస్ గెటప్ తో హైదరాబాద్ నగరంలో సందడి చేశాడు. రోడ్డు పక్కన ఉండేవారికి అదేవిధంగా అనాధాశ్రమంలో ఉండే వారికి బహుమతులు ఇస్తూ వాళ్లతో ప్రేమగా మాట్లాడుతూ.. అభిజిత్ క్రిస్మస్ రోజు సందడి చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో మీరు నా పట్ల చూపిన ప్రేమకు ఈ క్రిస్మస్ రోజు తిరిగి మీకు ఇద్దామని ఈ విధంగా ప్లాన్ చేసినట్లు వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా అభి చెప్పుకొచ్చాడు.