Bigg Boss 5 Telugu: లోబో తో యానీ మాస్టర్ లవ్ స్టోరీ చూసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఇదే !

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫైవ్ లో… ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువగా జనాలను ఆకట్టుకుంటూ ఉన్న ఏకైక కంటెస్టెంట్ లోబో. టెలివిజన్ రంగంలో యాంకర్ గా… ప్రేక్షకులకు సుపరిచితుడైన లోబో… తన హావభావాలతో.. డ్రెస్సింగ్ తో.. హౌస్ లో సందడి చేస్తూ.. రాణిస్తున్నాడు. లోబో ఆట తీరు గమనిస్తే ప్రారంభంలో చాలా బాగా ఆడిన అని వారాలు గడిచేకొద్దీ ఇతరులను ప్రభావితం తో…గేమ్ ఆడుతున్నట్లు ప్రస్తుతం బయట టాక్ నడుస్తుంది. ఎంటర్ టైన్మెంట్ పరంగా మాత్రమే ఆలోచిస్తున్నా లోబో… ఫిజికల్ టాస్క్ లు సరిగ్గా ఆడటం లేదన్నా టాక్ బలంగా ఉంది. ఇటువంటి తరుణంలో.. 39 వ రోజు.. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో..లోబో, యానీ, రవి, శ్రీ రామ్… శ్వేత ఐదుగురు కలిసి స్కిట్ వేయడం జరిగింది.

Anee Master Bigg Boss 5 Telugu Wiki, Age, Boy friend, Husband, Relationship, Family, Biography & More

లోబో.. శ్వేతా ని లవ్ చేసినట్లు.. ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదివినట్లు.. ఈ క్రమంలో లోబో..శ్వేతా నీ.. ప్రేమిస్తున్నట్లు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు యానీ మాస్టర్ నీ.. పర్మిషన్ అడగడానికి వాళ్ళ ఇంటికి వచ్చినట్లు స్కిట్ వేశారు. యానీ.. శ్వేతా తల్లిగా.. ఇంటిలో ఉన్న సమయంలో లోబో నీ.. శ్వేత పరిచయం చేయడం జరిగింది. యా నీ…లోబో అవతారం చూసి ఎవరితను ఇంత పెద్ద గా ఉన్నాడు.. మీ క్లాస్ మెట్ ఎలా అవుతాడు.. అంటూ లోబోపై పంచ్ డైలాగ్స్ వేయటం జరుగుతుంది. ఈ క్రమంలో తాను శ్వేత కోసం.. ఎక్కువ సార్లు ఫెయిల్ అయిన ఆమె క్లాస్ లో చదవటానికి.. త్యాగం చేసినట్లు లోబో…యాని మాస్టర్ తో చెప్పటం జరుగుద్ది. అదేసమయంలో శ్వేతా ఇష్టపడుతున్నట్లు కూడా యాని కి..లోబో తెలియజేస్తాడు. అయితే తన కూతురు ఇలాంటి వాడికి కి ఎవరిస్తారు అంటూ యానీ.. సంచలన డైలాగులు వేయడంతోపాటు శ్రీరామ్ కి…శ్వేతా నీ ఇచ్చి పెళ్లి చేయడానికి… రెడీ అవుతున్నట్లు తెలియజేస్తోంది.

Bigg Boss 5 Telugu 2nd week nomination list: Seven contestants in this week's nominations .. Did she leave the house ..? | Bigg Boss 5 Telugu 2nd week nominations list Bigg Boss Telugu - Heytamilcinema

హౌస్ లో రకరకాల డిస్కషన్ లు

ఈ క్రమంలో శ్రీరామ్.. ఎంట్రీ ఇచ్చి లోబో… ఇక్కడ ఏం చేస్తున్నావు..?? యానీ కి లైన్ వేస్తున్నావా అంటూ సెటైర్ వేసాడు. ఆ తర్వాత చివరిలో ఎంట్రీ ఇచ్చిన రవి…లోబో… ఇంటి దగ్గర మీ కూతురు ఏడుస్తుంది అంటూ అడ్డంగా పరువు తీసేసాడు ఒక డైలాగుతో. దీంతో సరదాగా ఐదుగురు వేసిన ఈ స్కిట్ బిగ్బాస్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేయడం జరిగింది. చివరిలో లోబో… రవి ఆ విధంగా డైలాగ్ వేస్తారని గుర్తించకపోవడంతో ఇది స్క్రిప్టులో… లేదు.. అంటూ తనకు తానుగా నవ్వుతూ అందరినీ నవ్వించడం జరిగింది. ఆ తర్వాత ఈ స్కిట్ గురించి హౌస్ లో రకరకాల డిస్కషన్ లు జరిగాయట. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉండటంతో లోబో.. ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రేక్షకులను అలరించడానికి.. బాగానే ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. తాజా స్కిట్ పై హౌస్ లో జనాలు డిస్కషన్ చేసుకోవడం జరిగిందట. ఇక లోబో, యానీ మాస్టర్ వాళ్ళ ఇళ్ళల్లో.. ఉమాదేవి వెళ్ళాక లోబో కి యానీ రూపంలో సరైన జోడీ దొరికిందని, అంటున్నారట. స్కిట్ లో.. అత్తగా లోబో కి యానీ నటించిన గాని చివరిలో శ్రీరామ్ పిల్ల తల్లి కి లైన్ వేస్తున్నట్లు.. డైలాగ్ కూడా హైలెట్. ఇదిలా ఉంటే ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి రవి, లోబో, శ్రీ రామ్, శ్వేత ఈ నలుగురు నామినేట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ ఎలిమినేషన్ కి సంబంధించి దాదాపు మూడు సార్లు లోబో… నామినేట్ అయ్యాడు.

Lobo: లోబోని పావుగా వాడుకుంటున్న రవి.. ప్రియ‌ని తిట్టించి,మాస్ట‌ర్‌ని బ‌య‌ట‌కు పంపించి.. | The News Qube

హౌస్ నుండి లోబో.. బయటకు వెళ్లే అవకాశాలు

దీంతో ఈసారి హౌస్ నుండి లోబో.. బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు జనాల టాక్. ఈ క్రమంలో గత పది రోజుల లోబో ఆట తీరు గమనిస్తే చాలా వరకు రవి పై ఆధారపడి గేమ్ ఆడినట్లు బయట జనాలు భావిస్తున్నారు. ప్రారంభంలో రవితో నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించిన లోబో… ఆ తర్వాత కాంప్రమైజ్ అయినట్లు..లోబో రిమోట్ రవి చేతిలో ఉన్నట్లు… బయట జనాలు భావిస్తున్నారు. సింపతి గేమ్ ప్రారంభంలో వర్కౌట్ అయినా గాని.. ఐదో వారంలో.. నాగార్జున ఈ విషయంలో వార్నింగ్ ఇవ్వడంతో…లోబో.. చాలావరకు రవి పైన ఆధారపడి.. హౌస్ లో గేమ్ ఆడుతున్న అనిపిస్తున్నట్లు చూస్తున్న ఆడియన్స్.. భావిస్తున్నారు. ఏదిఏమైనా ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుండి..లోబో.. బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి ఆరో వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.


Share

Related posts

ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన

sarath

బ్రేకింగ్: మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

Vihari

నాని అసలు నిజం చెప్పేసారా..? జగన్ మనసులో ఏముంది..??

Special Bureau