బోనమెత్తిన బిగ్ బాస్ అవినాష్

Biggboss Avinash in mallanna jathara in jagityal district
Share

అవినాష్.. బిగ్ బాస్ కు రాకముందు.. అవినాష్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ ఏదో తనకు తెలిసిన కామెడీని పంచేవాడు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ షోకు ఆఫర్ వచ్చిందో అప్పటి నుంచి అవినాష్ దశ తిరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు, తర్వాత బయటికి వచ్చాక అవినాష్ కు పాపులారిటీ పెరిగింది.

Biggboss Avinash in mallanna jathara in jagityal district
Biggboss Avinash in mallanna jathara in jagityal district

ప్రస్తుతం అవినాష్ టాప్ సెలబ్రటీ. స్టార్ మాలో ఈవెంట్లలోనూ మెరుస్తూ సొంతంగా తన యూట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తున్నాడు అవినాష్.

అవినాష్, అరియానా మధ్య ఉన్న రిలేషన్ షిప్, బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ పంచిన ఎంటర్ టైన్ మెంట్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు కానీ.. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఉండలేకపోయాడు అవినాష్. టాప్ 5 కంటే ముందే అవినాష్ ఎలిమినేట్ అయి బయటికి వచ్చినా.. అవినాష్ పై తెలుగు ప్రేక్షకులు చూపించిన అభిమానం మాత్రం తీర్చలేనిది.

ఇక.. తాజాగా సంక్రాంతి సందర్భంగా తన సొంతూరు జగిత్యాల జిల్లాకు వెళ్లిన అవినాష్.. తన ఊరు పక్కన జరిగే మల్లన్న జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ బోనం ఎత్తి.. మల్లన్న దేవుడికి సమర్పించారు. జగిత్యాల జిల్లాలో మల్లన్న జాతర చాలా ఫేమస్. మొత్తానికి అవినాష్ బోనం ఎత్తి.. జాతరలో పాల్గొని ఫుల్ టు ఎంజాయ్ చేశాడు. అవినాష్.. జాతరకు వచ్చాడని తెలుసుకున్న భక్తులు.. అవినాష్ ను చూడటానికి ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను అవినాష్ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసి మల్లన్నను దర్శించుకోండి.


Share

Related posts

ఎమ్మెల్సీ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిన టిడిపి! అది ఎలాగంటే ?

Yandamuri

Prabhas : ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమా..?

GRK

పేద దేశాలను ఆదుకోవడం కోసం కేంద్రం కీలక నిర్ణయం..!!

sekhar